»   »  ఏమైంది? హీరో అజిత్‌కు సర్జరీ చేసిన వైద్యులు

ఏమైంది? హీరో అజిత్‌కు సర్జరీ చేసిన వైద్యులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తమిళ స్టార్ అజిత్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వైద్యులు అతనికి సర్జరీ నిర్వహించారు. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆయనకు ‘సెప్టోప్లాస్టీ అండ్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ' నిర్వహించారు. ముక్కులో కండ పెరిగి మూసుకుపోయినట్లు అయినపుడు దాన్ని సర్జరీ చేసి తొలగించే పద్దతి ఇది. ఇఎన్‌టి స్పెషలిస్టు ఆధ్వర్యంలో ఈ సర్జరీ నిర్వహించారు.

అజిత్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే...
అజిత్, షాలిని దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే పాపకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్ ఇటీవల(మార్చి 2) మగ బిడ్డను కన్నారు. అజిత్, శాలిని ఇద్దరూ సినీ నటులు. పెళ్లికి ముందే పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ 'అమరకలమ్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో వీరిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు మీడియా సాక్షిగా వారు తమ ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 24, 2000లో వివాహం చేసుకున్నారు.

Ajith Undergoes Surgery

అజిత్, శాలిని మతాంతర వివాహం చేసుకున్నారు. అజిత్ కుమార్ హిందూ అయితే, శాలిని క్రిస్టియన్. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లి తర్వాత కూడా శాలిని తను కమిటైన రెండు ప్రాజెక్టులను పూర్తి చేసారు. ఆ తర్వాత సినిమాకు గుడ్ బై చెప్పారు. వీరికి 2008 జనవరి 8వ తేదీన పాప జన్మించింది. తమ కూతురుకి అనౌష్క అనే పేరు పెట్టుకున్నారు. ఇటీవల జన్మించిన బాబుకు ఇంకా పేరు పెట్టలేదు.

English summary
Popular Tamil star Ajith Kumar underwent knife. Doctors of a private hospital performed septoplasty and functional endoscopic sinus surgery for Ajith.The surgery was performed by an ENT specialist and Ajith is recovering well.
Please Wait while comments are loading...