»   » అఫీషియల్ : 'రోబో2' విలన్‌ ఫిక్స్

అఫీషియల్ : 'రోబో2' విలన్‌ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : మొత్తానికి సస్పెన్స్ వీడింది. గత కొద్ది నెలలుగా రోబో సీక్వెల్ లో ఎవరు విలన్ గా చేయబోతున్నారనే విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లు ఆర్నాల్డ్ అని, షారూఖ్ అని ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఆ స్పెక్యులేషన్స్ కు పుల్ స్టాఫ్ పెట్టడానికి దర్శకుడు సిద్దమయ్యారు. అఫీషియల్ గా ప్రకటించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రోబో2' (ఎంథిరన్‌2) చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో రజనీ సరసన ఎమీజాక్సన్‌ నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని విలన్‌ పాత్రకు ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్‌ని దర్శకుడు శంకర్‌ ఎంపిక చేసుకున్న విషయం విదితమే. అయితే కొన్ని కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆర్నాల్డ్‌ని దర్శకుడు శంకర్‌ తప్పించినట్టు సమాచారం. ఆర్నాల్డ్‌ ప్లేస్‌లో విలన్‌గా అక్షయ్‌కుమార్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అక్షయ్ ట్వీట్ సైతం చేసారు.

రజినీకాంత్‌, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్‌లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ రానుంది. ఈ సినిమాకి కూడా శంకరే దర్శకత్వం వహించనున్నారు.

అలాగే ఈ సీక్వెల్ చిత్రానికి టైటిల్ 'రోబో-2' అనే ప్రచారం జరుగుతోంది. అది కాదని రోబో 2.0 అని దర్శకుడు శంకర్ ట్వీట్ తో తెలియచేసారు. ఈ సినిమాలో భాగంగా అమీ శరీరాకృతికి తగ్గట్టు ప్రత్యేక దుస్తులు కూడా డిజైన్‌ చేస్తున్నారు.

Akshay Kumar plays the villain in 'Robot 2'

ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం మాఫియా దాన్‌గా చేస్తున్న కబాలి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గతకొద్ది రోజులుగాఈసినిమా మలేసియా, బ్యాంకాక్‌ లలో కబాలి షూటింగ్ జరుగుతోంది. కానీ ఈ చెన్నై షెడ్యూల్‌ కోసం రజనీకాంత్‌ ఓ స్మాల్‌ బ్రేక్‌ తీసుకోనున్నారు.

3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా చేసి ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్‌ నుంచిఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకేటైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాసం ఉంది.

English summary
Akshay Kumar has been signed to play the baddie in filmmaker Shankar's 'Robot 2,' which will also release in Tamil as 'Enthiran 2.'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu