»   »  ‘రోబో 2’: అక్షయ్ కుమార్ కే అసలు కష్టం

‘రోబో 2’: అక్షయ్ కుమార్ కే అసలు కష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రోబో 2.0' లో ఎంపికైన అక్షయ్ కుమార్ ఇప్పుడు తన బరువుని పెంచే పనిలో పడినట్లు సమాచారం. ఈ చిత్రంలో అక్షయ్ నెగిటివ్ పాత్రను పోషిస్తున్నారని, అందుకోసం ఆయన స్పెషల్ ఫిటినెస్ క్లాస్ లకు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆర్నాల్డ్ ని అనుకున్నారు. అయితే రెమ్యునేషన్ వంటి కొన్ని కారణాలతో అది మెటీరియలైజ్ కాలేదు.

అలాగే ఈ సినిమా కోసం అక్షయ్ ఓ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనున్నారని, అందుకోసం చెన్నై వెళ్లనున్నారని బాలీవుడ్ లో వినిపిస్తోంది. డిసెంబర్ 16నుంచి ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చెన్నైలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో రజనీ పాల్గొంటుండగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇందులో రజనీ సరసన ఎమీజాక్సన్‌ నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 2017 సమ్మర్ కానుకగా విడుదల అవుతుందని సమచారం. గ్రాఫిక్స్ కు ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది.

Akshay Kumar’s special training for Robot 2

అలాగే ఈ భారి బడ్జెట్ సినిమా కు సుమారు 400 కోట్ల రూపాయలవరకు ఖర్చు అవ్వోచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తమిళ మీడియా ల కథనం ప్రకారం ఈ సినిమాకు ప్రోడక్షన్ కాస్టింగ్ 350 కోట్ల వరకు అవ్వోచ్చని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మెత్తం పోస్ట్ ప్రోడక్షన్ తో కలిపి 400 నుండి 450 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని అంచనా ఉంది.

ఆర్నాల్డ్‌ ప్లేస్‌లో విలన్‌గా అక్షయ్‌కుమార్‌ నటించనున్నట్లు వచ్చిన విషయం, దీనికి సంబందించి అక్షయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.అలాగే ఈ సీక్వెల్ చిత్రానికి టైటిల్ 'రోబో-2' అనే ప్రచారం జరుగుతోంది. అది కాదని రోబో 2.0 అని దర్శకుడు శంకర్ ట్వీట్ తో తెలియచేసారు. ఈ సినిమాలో భాగంగా అమీ శరీరాకృతికి తగ్గట్టు ప్రత్యేక దుస్తులు కూడా డిజైన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం మాఫియా దాన్‌గా చేస్తున్న కబాలి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గతకొద్ది రోజులుగాఈసినిమా మలేసియా, బ్యాంకాక్‌ లలో కబాలి షూటింగ్ జరుగుతోంది. కానీ ఈ చెన్నై షెడ్యూల్‌ కోసం రజనీకాంత్‌ ఓ స్మాల్‌ బ్రేక్‌ తీసుకోనున్నారు.

3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా చేసి ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్‌ నుంచిఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకేటైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాసం ఉంది.

English summary
Akshay Kumar will play the lead antagonist in Rajinikanth starrer ‘Robot 2.0‘film for which he’ll add extra pounds to his body.
Please Wait while comments are loading...