»   » 'తుపాకి'హిందీ రీమేక్ ఖరారు..హీరో ఎవరంటే

'తుపాకి'హిందీ రీమేక్ ఖరారు..హీరో ఎవరంటే

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం 'తుపాకి'. విజయ్‌, కాజల్‌ జంటగా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందుతోంది. మరోవైపు తెలుగులోనూ విజయ్‌ మార్కెట్‌కు తగిన విజయాన్ని సొంతం చేసుకుంది. కథాపరంగా ఇది ముంబయిలో జరిగే అంశం కావడంతో హీరో అక్షయ్‌కుమార్‌ హిందీలో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విపుల్‌షా నిర్మాతగా తెరకెక్కనుంది. మురగదాస్ దర్సకత్వం వహిస్తారు.

  ఇక ఈ చిత్రంలో అక్షయ్‌కు జంటగా ప్రణీత చోప్రా కనిపించనున్నారు. వచ్చేనెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. మురుగదాస్‌ మొదట ఈ కథను అక్షయ్‌కే చెప్పారు. ఆయన పలు చిత్రాల్లో బిజీగా ఉండటంతో నటించలేకపోయారు. ఇప్పుడు రెండు భాషల్లోనూ విజయం వరించడంతో అక్షయ్‌ మరింత ఉత్సాహం చూపుతున్నట్లు ముంబయి వర్గాల సమాచారం. గతంలో 'గజని'తో మురుగదాస్‌ బాలీవుడ్‌లో తన సత్తా చాటారు. ఇప్పుడు 'తుపాకి' ని ఏ రేంజ్‌లో పేల్చుతారో వేచిచూడాల్సిందే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

  మరో ప్రక్క తుపాకి చిత్రంలో అభ్యంతరకరంగా ఉన్న ఐదు సన్నివేశాలను తొలగించినట్లు చిత్ర నిర్మాత థాను ప్రకటించారు. విజయ్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తుప్పాక్కి దీపావళి రోజున విడుదలైంది. తమ మనోభావాలన కించపరిచే పలు సన్నివేశాలు తుపాకిలో ఉన్నట్లు ముస్లిం సంఘాలు ఆరోపించాయి. విజయ్‌ నివాసాన్ని ముట్టడించేందుకు వీరు చేసిన ప్రయత్నాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

  ఆపై విజయ్‌, కలైపులి థాను నివాసాలతో పాటు, విజయ్‌ అభ్యర్థన మేరకు తుప్పాక్కి ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద కూడా పోలీసు భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే థాను, విజయ్‌ తండ్రి, సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌లు నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌ని కలిశారు. బయటకొచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తుప్పాక్కిలో అభ్యంతరకర సన్నివేశాలు ఐదు ఉన్నట్లు ముస్లిం సంఘాలు తెలిపాయని, వీటిపై వివరణ ఇచ్చేందుకు కమిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. అంతే కాకుండా సంబంధిత సన్నివేశాలను తొలగించటంతో పాటు, తొలగించిన సన్నివేశాలతో కూడిన సినిమా సీడీలను ముస్లిం సంఘాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

  English summary
  With Thuppakki’s stupendous success, AR Murugadoss has bounced back and is one of India’s most wanted filmmakers today. The prolific filmmaker is moving on to Bollywood once again after a gap of four years (the previous one being blockbuster Ghajini) with the remake of Thuppakki. And the big news is that, as we wrote earlier, Akshay Kumar will reprise Ilayathalapathy Vijay in the Hindi version.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more