»   » రజనీ మెచ్చుకున్నారు...గాల్లో తేలినట్లుంది

రజనీ మెచ్చుకున్నారు...గాల్లో తేలినట్లుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ తమని మెచ్చుకుంటే బాగుంటుందని అందరికి అనిపిస్తుంది. అయితే అటువంటి సందర్బాలు అరుదుగా సంభవిస్తాయి. అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కు ఆయన అభినందనలు దొరికాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా...'రోబో' సీక్వెల్‌ '2.0' చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్షయ్‌కుమార్‌ నటనను సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మెచ్చుకున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీ హీరోగా, అక్షయ్‌కుమార్‌ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ ప్రస్తుతం దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. ఇటీవల అక్షయ్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరించారు.

Akshay Kumar very happy to act with Rajinikanth

సోమవారం రజనీకాంత్‌ కూడా షూటింగ్‌లో పాలుపంచుకున్నారు. తొలిసారిగా ఇద్దరూ కలిసిన నేపథ్యంలో సెట్‌లో సందడి నెలకొంది. ఆ రోజు షూటింగ్‌ ముగిశాక అక్షయ్‌ నటనను రజనీ మెచ్చుకున్నారట. చాలా బాగా చేస్తున్నారని అభినందించారని సమాచారం. దాంతో అక్షయ్ చాలా సంతోషంగా తన మిత్రులకు,సన్నిహితులకు ఈ విషయం చెప్పాడని బాలీవుడ్ మీడియా చెప్తోంది.

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.."నేను కలలో కూడా ఇలాంటివి ఊహించలేదు.ఆయన అద్బుతమైన నటుడు..అంతేకాదు గొప్ప మానవతా వాది కూడాను. ఆయనతో కలిసి నటించటం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. యాక్షన్, గ్రాఫిక్స్, ఆయన పంచ్ లు ఇవన్ని నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి ." అన్నారు.

English summary
Akshay Kumar, who has been roped in to play the negative role in Rajinikanth's Endhiran 2.0, has said that it would be an honour for him to be punched by the superstar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu