»   » ట్రైలర్ లో సీన్ కి నెగిటివ్ రెస్పాన్స్...తొలిగింపు

ట్రైలర్ లో సీన్ కి నెగిటివ్ రెస్పాన్స్...తొలిగింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినిమా రిలీజ్ కాకముందే సీన్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుంది. ట్రైలర్ లోవదిలిన సీన్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావటంతో ఆ సీన్స్ తొలిగించాల్సి వచ్చింది. ఇది 'శకుని' చిత్రం తర్వాత కార్తీ హీరోగా వస్తున్న చిత్రం 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' కి జరిగింది. రాజేష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. కాజల్‌ హీరోయిన్. సంతానం హాస్యపాత్ర పోషించారు.

వివరాల్లోకి వెళితే... ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ ఇటీవల థియేటర్లలో విడుదల చేశారు. అందులో క్యాన్సర్‌పై అవగాహన కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రకటనను సంతానం హేళన చేసినట్లు ఓ సన్నివేశం ఉంది. దీనిపై చిత్రపరిశ్రమలోనేకాదు.. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. యూనిట్‌ అప్రమత్తమై దాన్ని తొలగించింది. 

కార్తీ మాట్లాడుతూ.. ''దర్శకుడు రాజేష్‌కు మా ఇంట్లో అందరూ అభిమానులే. హాస్యం ఎక్కువైతే కానీ మా అమ్మ నవ్వదు. ఆమెను నవ్వించడం కష్టం. కానీ రాజేష్‌ దర్శకత్వంలోని 'బాస్‌ ఎన్గిర భాస్కరన్‌', 'ఓకే ఓకే' చిత్రాలను చూసి నవ్వారు. రాజేష్‌కు హాస్యగుణాలు ఎక్కువ. ప్రజల్లో ఎక్కువగా అవగాహన ఉన్న విషయాలతో నవ్వులు పూయిస్తారు. ఆ విధంగానే అందరికీ సుపరిచితమైన ఆ సన్నివేశంపై నవ్వులు విసిరారు. కానీ కొందరికి అది నచ్చలేదు. అందువల్లే సినిమా నుంచి తొలగించేశాం. దీపావళినాడు కుటుంబ సభ్యులందర్నీ నవ్వించడానికే మా యూనిట్‌ వస్తోంది''అని చెప్పారు.

ఈ చిత్రంలో ప్రేమ, హాస్యం కలగలిపి కార్తీ నటించనున్నాడు. సాధారణ మాటల్లో దాగున్న హాస్యాన్ని వెతికి మరీ.. తెరపై వెదజల్లి చిరునవ్వుల పంటను పండించడంలో దర్శకుడు రాజేష్‌ సిద్ధహస్తుడు. 'ఎస్‌ఎంఎస్‌', 'బాస్‌ ఎనగర బాస్కరన్', 'ఓకే ఓకే' వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ మూడు చిత్రాల్లోనూ ఒకే శైలి హాస్యం ఉన్నా.. భిన్నమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇప్పుడీ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నాడు.

చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ... నా సినిమా వన్‌లైన్‌ కథేనండి. ఈగో ప్రేమికుడు, పొగరుబోతు ప్రియురాలు.. చివరకు ఎలా కలసిశారన్నదే 'ఎస్‌ఎంఎస్‌'. ఏమాత్రం బాధ్యత లేని కుర్రాడు ఇంటిని చక్కబెట్టే వదిన వచ్చిన తర్వాత ఎలా మారాడన్నదే 'బాస్‌', పాండిచ్చేరిలో జరుగుతున్న ప్రియురాలి పెళ్లిని ఓ యువకుడు తన స్నేహితుడితో వెళ్లి ఆపుతాడా.. లేదా.. అన్నదే 'ఓకే ఓకే'. ఈ వన్‌లైన్‌ కథకు సాధారణ హాస్యాన్ని జత చేస్తాం అంతే.

ఇక 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' గురించి చెప్పాలంటే.. పట్టణంలో పెరిగే ఓ యువకుడికి తన తల్లిదండ్రులే దైవాలు. ఈ అంశంతో హాస్యం, ప్రేమ, సెంటిమెంట్‌ కలగలిపి సినిమాగా తెరకెక్కుతోంది. ఓ తిరునాళ్లకు వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది ఈ చిత్రాన్ని చూసొచ్చిన ప్రేక్షకుడికి అన్నారు. అలాగే హాస్యం మాత్రమే నా స్క్రిప్టు కి ప్రాణం. కానీ గత చిత్రాల్లో లేని సెంటిమెంట్‌ను ఈ సినిమాలో కొత్తగా చేర్చా. అంతేకాదు.. మూడు సినిమాల్లో మాదిరిగా సంతానానికి పంచ్‌లు ఇవ్వలేదు. బాడీలాంగ్వేజ్‌తోనే నటించమని చెప్పేశా. ఈ సినిమా కోసం సంతానం హోంవర్క్‌ చేశాడు. స్పాట్‌లో సింగిల్‌ షాట్‌లోనూ కానిచ్చేస్తున్నాడు. ఆయన హిట్‌రేట్‌ పెరిగేకొద్దీ నటన కూడా అలానే ఉంది అన్నారు.

English summary
The teaser of All in All Azhagu Raja where Santhanam imitates late Guktha Mukesh (anti-tobacco ad ) has not gone well with with the Tamil Nadu People’s Forum for Tobacco Control (TNPFTC) and anti-tobacco campaigners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu