»   » అల్లు అర్జున్ 'ఆర్య' తమిళ రీమేక్ ఏమైంది?

అల్లు అర్జున్ 'ఆర్య' తమిళ రీమేక్ ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్య చిత్రం తాజాగా తమిళంలోకి కుట్టి టైటిల్ తో రీమేక్ అయింది. ధనుష్, శ్రియ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని జవహర్ మిత్రన్ అనే దర్శకుడి డైరక్షన్ లో జెమినీ ఫిల్మ్ సర్కూట్స్ వారు నిర్మించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా బి, సి సెంటర్లలో ధనుష్ కున్న క్రేజ్ ని బాగానే క్యాష్ చేసుకోగలుగుతోంది. ఇదే రకంగా కలెక్షన్స్ రాబోయే వారాల్లో ఉంటే సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవుతుందని తమిళ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగుకి సంగీతం అందించి దేవిశ్రీ ప్రసాద్ అక్కడ కూడా మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా అ అంటే అమలాపురం ట్రైన్ సాంగ్ ఉన్నదున్నట్లుగా ట్యూన్ తో పాటు చిత్రీకరణ కూడా అలాగే ఉంచారు. ఇక లాస్ట్ ఇయిర్ ఒక్క విజయం కూడా లేని శ్రియ ఈ చిత్రం విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు ఫీలవతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X