»   » కన్నుగొట్టిన పిల్లకు అల్లు అర్జున్ పడిపోయాడు.. అర్జున్ రెడ్డి భామ ఫిదా..

కన్నుగొట్టిన పిల్లకు అల్లు అర్జున్ పడిపోయాడు.. అర్జున్ రెడ్డి భామ ఫిదా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Priya Warrior Expression Goes Viral, Star Heros 'Fidaa'

ఒక్క కనుసైగతోనే ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. సినీ ప్రేక్షకులు, కుర్రకారే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. ప్రియా హావభావాలపై సినీ తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెను అభిమానించే తారల జాబితాలో అల్లు అర్జున్, అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే కూడా చేరిపోయారు. మలయాళ చిత్రం ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ అనే పాట ఇప్పడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే.

క్యూట్ వీడియో ఇది

సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో యువతను కుమ్మెస్తున్న ఈ వీడియోపై అల్లు అర్జున్ స్పందించాడు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. ఈ మధ్యకాలంలో నేను చూసిన అద్భుతమైన పాట ఇది. నేను చాలా బాగా ఇష్టపడ్డాను. ది పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ. అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

స్టైలిష్ స్టార్‌కు ప్రియా థ్యాంక్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌పై ప్రియా వారియర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. థ్యాంక్యూ సో మచ్ సర్ అని ట్వీట్‌లో పేర్కొన్నది. మలయాళంలో అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

ప్రియా వారియర్‌పై షాలిని పాండే

ప్రియా వారియర్‌పై షాలిని పాండే

అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారిన షాలిని పాండే కూడా ప్రియాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈసారి వాలంటైన్ డేను ప్రియా వారియర్ ఒక్కతే ఘనంగా జరుపుకుంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు అని షాలిని పాండే ట్వీట్ చేసింది.

దేశం మొత్తం ఆ అమ్మాయితోనే

దేశం మొత్తం ప్రియా వారియర్ వెంటపడుతున్నది. ఇలాంటి అమ్మాయిని ఇంతవరకు నేను చూడలేదు. బెస్టాఫ్ లక్ ఫర్ ఓరు అదార్ లవ్. మాణిక్య మలరాయ పూవీ అని షాలిని ట్వీట్లో పేర్కొన్నారు.

 10 లక్షల వ్యూస్‌కు చేరువలో

10 లక్షల వ్యూస్‌కు చేరువలో

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ అనే పాట యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది. అత్యంత వేగంగా మిలియన్ వ్యూస్‌కు చేరువైంది. ఇప్పటి వరకు 9,711,319 వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది.

 మార్చి 3న రిలీజ్

మార్చి 3న రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకొంటున్న ఓరు అదార్‌ లవ్‌ చిత్రం మార్చి 3న విడుదల అవుతోంది. స్కూల్ విద్యార్థుల జరిగే రొమాన్స్ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కతున్నది. విద్యార్థులు కనుసైగలతోనే మాట్లాడుకోవడం చాలా ఆకట్టుకొనేలా ఉన్నాయి.

English summary
The sensational clip is gifted by the song 'Manikya Malaraya Poovi' from the upcoming movie Oru Adaa. Turns out this clip is from a Malayalam song Manikya Malaraya Poovi from the movie Oru Adaar Love. The folklore song is composed by Shaan Rahman and is sung by Vineet Sreenivasan. The song is already a big hit, it has clocked in 4 million views already! If High school romances make you go putty, this song is for you. Allu Arjun and Shalini pandey are tweet about this video.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu