»   » ‘భారతీయుడు-2’ వస్తోంది, త్వరలో ప్రారంభం..

‘భారతీయుడు-2’ వస్తోంది, త్వరలో ప్రారంభం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఎంఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996 ఇండియా వ్యాప్తంగా విడుదలై సినీ ప్రేమికుల మనసు దోచింది. అప్పట్లో ఈ సినిమా చూడని భారతీయుడు ఉండి ఉండరంటే అతిశయోక్తి కాదేమో!

ఇపుడు కమల్ హాసన్ మరోసారి శంకర్ దర్శకత్వంలో ఈచిత్రానికి సీక్వెల్ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఉందని, అది భారతీయుడు సినిమాకు సీక్వెల్ అవుతుందని అంటున్నారు.

 AM Ratnam Confirms Bharateeyudu 2, Says The Project Will Start Soon!

ఈ విషయమై ‘భారతీయుడు' నిర్మాత ఎఎం రత్నం స్పందిస్తూ....ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని, దీనిపై ఇప్పటికే తాను కమల్ హాసన్, శంకర్ లతో మాట్లాడినట్లు ఎఎం రత్నం చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని చేయాలని అనుకుంటున్నాం, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కావొచ్చని అంటున్నారు.

అప్పట్లో ‘భారతీయుడు' సినిమా నిర్మాత ఎఎం రత్నంకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. అంతే కాకుండా ఈ చిత్రం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ చిత్రంగా ఆస్కార్ అకాడెమీ అవార్డులకు కూడా నామినేట్ అయింది. అన్ని అనుకూలంగా జరిగితే మళ్లీ ‘భారతీయుడు-2' చిత్రం ద్వారా రెండు దశాబ్దాల అనంతరం కమల్ హాసన్-శంకర్ కలిసి పని చేయబోతున్నారు.

English summary
Once a close associate of Kamal Haasan had said that the Ulaganayagan had expressed his interest to work on the sequel to his 1996 blockbuster film Indian along with director Shankar.
Please Wait while comments are loading...