»   »  కమలహాసన్‌ తో చేస్తున్నా...ఆ కండీషన్ తోనే

కమలహాసన్‌ తో చేస్తున్నా...ఆ కండీషన్ తోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగి...తర్వాత కాలంలో వివాహం చేసుకుని కుటుంబ జీవితానికే అంకితమై గృహిణిగా ఉంటూ అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తున్నారు అమల. అమల కమలహాసన్‌ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. చాలా రోజుల తర్వాత మరోసారి ఆమె కమలహాసన్‌ చిత్రంలో అతిథి పాత్ర పోషించనున్నారు.
అమల మాట్లాడుతూ... తాను ప్రస్తుతం పూర్తిస్థాయిలో కుటుంబంపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కాని, సినిమాల్లో అనేక విషయాలు నేర్చుకోవాలన్న కోరిక కూడా ఉందన్నారు. ఈ కారణంగా కొన్ని చిత్రాల్లో మాత్రం నటించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఏ చిత్రానికైనా కేవలం 10 రోజులు మాత్రమే కాల్‌ షీట్‌ కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల నటుడు కమలహాసన్‌ తనను సంప్రదించారన్నారు. ఇంకా చిత్రాల్లో నటిస్తున్నారా ఆయన ప్రశ్నించారన్నారు. తాను పూర్తి స్థాయిలో నటించడం లేదని, కేవలం 10 రోజులు కాల్‌షీట్‌ కేటాయించే చిత్రాల్లో అతిథి పాత్ర పోషించేందుకు మాత్రం అంగీకరిస్తున్నట్లు తెలిపారు.

Amala Again Pair with Kamal Hassan After a Long Time ...

దీంతో ఆయన చిత్రంలో నటించేందుకు ఆహ్వానం పలికారన్నారు. కమలహాసన్‌ సూచన మేరకు ఆ మరుసటి రోజే మలయాళ చిత్ర దర్శకుడు టికె.రాజీవ్‌కుమార్‌ వచ్చి, తాను నటించే పాత్రకు సంబంధించిన స్క్రిప్టు వివరించినట్లు తెలిపారు. అది విన్న తర్వాత ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందన్నారు. దీంతో తాను నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.

గతంలో కమలహాసన్‌తో ఈమె జంటగా నటించిన చిత్రం ‘సత్య' ఘన విజయం సాధించింది. ఆ చిత్రంలో ‘వలయోసై గల గల' అనే పాట, అందులో వీరిద్దరూ నటించిన సన్నివేశాలు అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించాయి.

English summary
After a long gap of 27 years, Amala will pair up with Kamal Haasan. Both will be uniting for national award winning director T K Rajeev Kumar’s film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu