Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడాకులకు ధనుష్ కారణం కాదు.. ఆ తరువాతే మళ్లీ ప్రేమ-పెళ్లి.. అమలాపాల్ కామెంట్స్
నాన్న, ప్రేమఖైదీ వంటి చిత్రాల్లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్న హీరోయిన్ అమలాపాల్. అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకునే అమలాపాల్.. ఆమె చిత్రంలో నగ్నంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దర్శకుడు విజయ్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్నీ జరిగిపోయి ఎవరి దారిన వారు బతుకుతుంటే మళ్లీ వీరిద్దరికి సంబంధించిన వార్తలు హల్ చల్ అవుతున్నాయి.

ఎవరి పనుల్లోవారు బిజీ..
అమలాపాల్ దర్శకుడు విజయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకోగా.. ఆ తరువాత నటి అమలాపాల్ నటనపై దృష్టి పెట్టగా విజయ్ దర్శకత్వంపై నిమగ్నమయ్యారు. ఇటీవల ఆయన ఒక వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు.

ధనుషే కారణం..
ఇలాంటి స్థితిలో దర్శకుడు విజయ్ తండ్రి, నిర్మాత, నటుడు ఏఎల్.అళగప్పన్ అమలాపాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అమలాపాల్.. విజయ్ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణం అని బాంబ్ పేల్చాడు. ధనుష్ నిర్మించిన ‘అమ్మ కణక్కు' చిత్రంలో నటించమని అమలాపాల్‌ను కోరాడని తెలిపాడు. అయితే పెళ్లికి ముందు ఇకపై నటించనని చెప్పిన అమలాపాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైందని.. అదే విజయ్‌కు, ఆమెకు మధ్య విడాకులకు దారి తీసిందని చెప్పారు.


ధనుష్ కారణం కాదు..
‘మీ వివాహ రద్దుకు నటుడు ధనుష్ కారణమనేది వాస్తవమా?' అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు అడుగుతున్నారేంటని ఆశ్చర్యపోయింది. అయినా తన వివాహ రద్దు గురించి చర్చ అనవసరం అని పేర్కొంది. అది తన వ్యక్తిగత విషయమని ధీటుగా సమాధానమిచ్చింది. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, అందుకు వేరెవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చింది.

ఆ తరువాతే ప్రేమ-పెళ్లి
‘అయినా వేరెవరి కారణంగానో వివాహాన్ని రద్దు చేసుకుంటారా?' అని తిరిగి ప్రశ్నించింది. నటుడు ధనుష్ తాను బాగుండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పింది. ఈ విషయంపై ఇంకేమీ తనను అడగవద్దు అని, ఇంతకు మించి మాట్లాడటానికి తనకు ఇష్టం లేదంది. ‘మీరు మళ్లీ ప్రేమలో పడ్డట్టు ప్రచారం హోరెత్తుతోంది. పెళ్లెప్పుడు చేసుకుంటార'న్న ప్రశ్నకు అందుకు ఇంకా సమయం ఉందని, తాను నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి వెల్లడిస్తానని అమలాపాల్ తెలిపింది.