Just In
Don't Miss!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : ఓ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు...!
- News
పాకిస్తాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ షాక్... మళ్లీ గ్రే జాబితాలోనే... కొత్త డెడ్ లైన్ ఎప్పటివరకంటే...
- Finance
Gold price@రూ.46,150: రూ.10,000 కంటే ఎక్కువ తగ్గిన పసిడి ధరలు
- Sports
India vs England: చెలరేగిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం!
- Automobiles
50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అలాంటి జీవితంపై మనసు పారేసుకుంది.... షాకిస్తోన్న అమలాపాల్ నిర్ణయం
అమలాపాల్ అంటే ఆమె చిత్రానికి ముందు.. ఆమె చిత్రానికి తరువాత అనేట్టు మారిపోయింది. అంతకు ముందు వరకు నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ వచ్చిన అమలాపాల్.. ఆమె చిత్రంలో నగ్నంగా నటించి అందర్నీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. దాదాపు సగం సినిమా అంతా ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా నటించి ఉలిక్కి పడేలా చేసింది.

గతకొన్ని రోజులుగా వార్తల్లో..
అమలాపాల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అమలాపాల్, దర్శకుడు విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పై ఇద్దరూ ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకున్న సంగతీ తెలిసిందే. ఇదంతా గతం అనుకుంటూ ఉండగా.. విజయ్ తండ్రి మళ్లీ వీటిని తెరపైకి తెచ్చాడు.

విడాకులకు ధనుషే కారణం..
విజయ్-అమలాపాల్ విడాకులకు ధనుష్ కారణమని, ఆయన నిర్మించిన ఓ చిత్రంలో ఆమె నటించడం విజయ్‌కు ఇష్టం లేదని అందుకే ఇద్దరు విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. అయితే అలాంటిదేమీ లేదని, అది తన నిర్ణయమేనని ఆ వార్తలను ఖండించింది.
|
ఆ జీవితంపై మనసు పారేసుకుంది..
గత కొన్ని రోజులుగా అమలాపాల్ ఓ చోట కుదురుగా ఉండటం లేదు. ప్రకృతిని ఆస్వాధిస్తూ దేశవిదేశాలను చుట్టేస్తోంది. తాజాగా అమలాపాల్ చేసిన పోస్ట్ చెప్పిన విశేషాలు చూస్తే అందరికీ షాకింగ్‌గా అనిపించవచ్చు.


సాత్విక జీవితాన్ని దగ్గరగా..
ఈ మధ్య ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నాని, సాత్విక జీవితాన్ని దగ్గరవ్వాలని అనుకుంటున్నట్లు ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. మనమంతా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నామని, మన పద్దతులు, సంప్రదాయలు, ఆహారపు అలవాట్లు, ఆయుర్వేద పద్దతులే మంచివని చెప్పుకొచ్చింది.