»   » అమల చుట్టూ మరోవివాదం... బుద్దుడి మీద కాళ్ళు

అమల చుట్టూ మరోవివాదం... బుద్దుడి మీద కాళ్ళు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది రోజుల క్రితం ..నటి అమలా పాల్‌, ఏ.ఎల్‌. విజయ్‌లు అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్లు బ్రతుకుతున్నారు.దర్శకుడు విజయ్‌, హీరోయిన్ అమల పాల్ ప్రేమించి పెళ్లిచేసుకున్న కొద్ది రోజులుకే స్పర్దలు వచ్చి విడిపోయారు.

సరే అదంతా పాతకథ ఇప్పుడు తన సినిమాలు తాను చేసుకుంటూ ఆనందంగానే ఉంది అమల. అయితే ఇప్పుడు అనుకోకుండా మరో వివాదం లో ఇరుక్కుంది. అయితే పాపం కావాలని చేసింది కాదు. ఫొటోగ్రాఫర్ చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు అమలని విమర్శల్లో ముంచెత్తుతోంది...

Morningz made perfect with @apsaravydyula Happy Sunday all :) #yogasundaygonewild #yogaholics #yogaeverydamnday

A post shared by Amala Paul (@dreamcatcher_ams) on Mar 25, 2017 at 7:41pm PDT

దానికి కారణం ఆమె తాజా ఫోటో షూట్‌. యోగా ఫోజులతో అమల ఓ హాట్‌ ఫోటో షూట్‌ను నిర్వహించి ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసింది. అయితే ఆమె ఫోటో షూట్‌ చేసిన గది గోడపై భారీ సైజులో గౌతమ బుద్ధుడి పెయింటింగ్‌ ఉంది. అమల ఆ గోడకు ఆనుకుని శీర్షాసనం వేసింది.

దాంతో ఆమె కాళ్లు బుద్ధుడి మొహానికి తాకుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. అమె బుద్ధుడిని అవమానించిందని, వెంటనే ఆ ఫోటోలను తొలగించి క్షమాపణలు చెప్పాలని చాలామంది నెటిజన్లు సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేస్తున్నారు. అభ్యంతర వ్యాఖ్యలతో ఆమెను దూషిస్తున్నారు. అయితే అమల మాత్రం వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఆ ఫొటోను కూడా తీయకుండా అలానే ఉంచేసింది మరి.

English summary
The photos show a mural of Buddha on the wall behind Amala, and one of the images has Amala resting her legs on Buddha's face in the Shirshasana posture.This has caused a bit on an uproar on social media, with several users expressing their disapproval.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu