అమలాపాల్ న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్..డిటేల్స్

తన కుటుంబంతో అక్కడికి వెళ్లనుందట. అక్కడ జరిగే కొత్త ఏడాది ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనటంతోపాటు తర్వాత కుటుంబంతో కలిసి వేడుకలు చేసుకోనుంది. దాంతో క్యూట్ అమలాపాల్ ఇప్పుడు చాలా హుషారుగా ఉంది. మరో ప్రక్క 2014లో తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ ఆమె నటించిన సినిమాలు విడుదల కానున్నాయి.
అమలాపాల్ మాట్లాడుతూ "నేను అనుకోకుండా నటిని అయ్యాను. పర్సనల్ లైఫ్ వేరు. ప్రొఫషన్ వేరు. రెండిటినీ కలపడం నాకు నచ్చదు. అందుకే పండుగలను, ప్రత్యేక సందర్భాలను నేను ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ, ఫ్రెండ్స్‌తోనూ సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సారి న్యూ ఇయర్ వేడుకలను ప్రత్యేకంగా ఇటలీలో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి ఇటలీ ప్రయాణమవుతున్నాం. వారం రోజులు అక్కడే ఉండి అన్ని ప్రదేశలు చూసి వస్తాం. అక్కడ షాపింగ్ కూడా చేయాలనుకుంటున్నాను'' అని చెప్పింది అమలాపాల్.


Click it and Unblock the Notifications











