»   »  రజనీ జీవిత గాధ విడుదల అమితాబ్ చే...

రజనీ జీవిత గాధ విడుదల అమితాబ్ చే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Amitabh Bachchan
రజనీకాంత్ జీవితగాధ సిద్ధమైంది. రజనీ అభిమాని డాక్టర్ గాయత్రీ శ్రీకాంత్ రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంగీకరించారు. మార్చి ఒకటో తేదీన ఈ పుస్తకం విడుదల కానుంది.

షారుఖ్ ఖాన్ జీవితం మీద వచ్చిన గ్రంధమే తాను రజనీకాంత్ జీవిత చరిత్ర రాయడానికి ఆదర్శమని రచయిత్రి డాక్టర్ గాయత్రి తెలిపారు. రజనీకాంత్ సినిమా రంగంలోకి రాక ముందు ఆయన బెంగుళూరులో బస్ కండక్టర్ గా పని చేశారు. ఆ వివరాలను సేకరించడానికి డాక్టర్ గాయత్రి ఏదాది పాటు బెంగుళూరులో బస చేయడం విశేషం.

రజనీ జీవిత గాధను విడుదల చేయడానికి రావలసిందిగా రచయిత్రి అమితాబ్ బచ్చన్ ను కోరగా ఆయన ఆనందంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావలసిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంకా కన్ ఫర్మేషన్ రావలసి ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X