»   » అలా అడగొద్దు ..చెప్పను : అమీ జాక్సన్‌

అలా అడగొద్దు ..చెప్పను : అమీ జాక్సన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : దర్శకుడు శంకర్ గత చిత్రం ఐ లో హీరోయిన్ గా చేసిన అమీ జాక్సన్... సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించనున్న ‘రోబో 2'లో కూడా హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. తమిళ సిని వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆమె ఆడ రోబో గా కనిపించనుంది. అయితే అది నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై మీడియా వారు ఆమె ను ప్రశ్నించారు. దానికి ఆమె స్పందించింది.

అమీ జాక్సన్ మాట్లాడుతూ... ప్రస్తుతం ‘రోబో-2' లో చేస్తున్నా. ఇందులో రోబోగా నటిస్తున్నానా? లేదా? అనే విషయం ఇప్పుడు చెప్పలేను. ‘ఐ' తర్వాత మళ్లీ శంకర్‌ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది''అని పేర్కొంది.

ఇక ధనుష్‌, అమి జాక్సన్‌ జంటగా నటించిన ‘తంగమగన్‌' (నవ మన్మధుడు) ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా అమి జాక్సన్‌ మీడియాతో మాట్లాడింది.అమీ జాక్సన్ మాట్లాడుతూ... ‘‘ఈ ఏడాది బిజీగా ఉన్నా. వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నా. ‘తంగమగన్‌'లో 17 ఏళ్ల విద్యార్థినిగా నటిస్తున్నా. తక్కువ వయస్సుండే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. ధనుష్‌ సమర్థుడైన నటుడు. చిత్రీకరణ స్పాట్‌లో నాకు ఎంతో సహాయం అందించారు. నేను తమిళం మాట్లాడటం గురించి పలువురు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు.

Amy Jackson about her character in Robo-2

షూటింగ్ సందర్భంగా నాకు తమిళం మాట్లాడటంలోనూ శిక్షణ ఇస్తున్నారు. పెదాల కదలిక ప్రధానం కావడంతో తమిళ సంభాషణలు బట్టీపట్టి నేర్చుకుంటున్నాను. ‘తంగమగన్‌'లో నాకు నటి ఆండ్రియా డబ్బింగ్‌ చెప్పారు.

హిందీ చిత్రం ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌'లో నా పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నా. త్వరలో తమిళంలోనూ అలా చేయడానికి ప్రయత్నిస్తున్నా. విజయ్‌తో ‘తెరి'లోనూ నటిస్తున్నా. అందులో కేరళకు చెందిన ఉపాధ్యాయనిగా కనిపించనున్నా అన్నారామె.

‘మదరాస పట్టిణం' చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన లండన్‌భామ ఎమీ జాక్సన్‌. ఆ తర్వాత తెలుగు, హిందీ జనాలకు కూడా సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఆమె దాదాపు దక్షిణాది హీరోయిన్ గా మారిపోయారు. ఓవైపు ఉదయనిధి సరసన ‘గెత్తు'లో, మరోవైపు ధనుష్‌తో కలసి ‘తంగమగన్‌', ఇంకోవైపు విజయ్‌తో ‘తెరి'లో నటిస్తూ బిజీగా ఉంది.

అమీ జాక్సన్ మాట్లాడుతూ... నేనెంతగానో ఇష్టపడే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించబోతున్నాననే మాట వినగానే సంబరంలో మునిగిపోయా. నిజంగానే నేను లక్కీగాళ్‌. అంతేకాకుండా శంకర్‌ దర్శకత్వంలో మళ్లీ నటిస్తుండటం నిజంగానే అదృష్టం. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.

అలాగే ఒక్కో సినిమాలో భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నా. నాకు ఇండియానే ముఖ్యంగా దక్షిణ భారతదేశమే నా పుట్టినిల్లుగా మారిపోయింది. చెన్నై, హైదరాబాద్‌.. అంటూ చక్కర్లు కొడుతున్నా. ఇక్కడి సంస్కృతి కూడా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

English summary
Amy Jackson not interest to revel her character in Superstar-starrer Robo 2.
Please Wait while comments are loading...