»   » లీక్ : ‘రోబో 2.0' లో అమీ జాక్సన్ క్యారక్టర్

లీక్ : ‘రోబో 2.0' లో అమీ జాక్సన్ క్యారక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించనున్న ‘రోబో 2.0'లో కూడా హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు తమిళ సినీ వర్గాల ద్వారా బయిటకు వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఆడ రోబో గా కనిపించనుంది. అంతేకాదు రజనీకాంత్ కు అసెస్టెంట్ గా కనిపిస్తుంది. రోబో గా ఆమె రజనీకు సలహా, సహకారాలు అందిస్తూంటుంది. అయితే అది నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది.

అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇవిపి ఫిల్మ్ సిటీ, చెన్నైలో జరుగుతోంది. ఇక్కడ భారీగా వేసిన సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. కబాలి కోసం మలేషియా వెళ్లిన రజనీకాంత్ వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. ఈ లోగా ఆయన లేని సన్నివేశాలు పూర్తి చేయనున్నారు.

Amy Jackson role in Robo 2.0 revealed

‘మదరాస పట్టిణం' చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన లండన్‌భామ ఎమీ జాక్సన్‌. ఆ తర్వాత తెలుగు, హిందీ జనాలకు కూడా సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఆమె దాదాపు దక్షిణాది హీరోయిన్ గా మారిపోయారు. ఓవైపు ఉదయనిధి సరసన ‘గెత్తు'లో, మరోవైపు ధనుష్‌తో కలసి ‘తంగమగన్‌', ఇంకోవైపు విజయ్‌తో ‘తెరి'లో నటిస్తూ బిజీగా ఉంది.

అమీ జాక్సన్ మాట్లాడుతూ... నేనెంతగానో ఇష్టపడే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించబోతున్నాననే మాట వినగానే సంబరంలో మునిగిపోయా. నిజంగానే నేను లక్కీగాళ్‌. అంతేకాకుండా శంకర్‌ దర్శకత్వంలో మళ్లీ నటిస్తుండటం నిజంగానే అదృష్టం. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.

Amy Jackson role in Robo 2.0 revealed

అలాగే ఒక్కో సినిమాలో భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నా. నాకు ఇండియానే ముఖ్యంగా దక్షిణ భారతదేశమే నా పుట్టినిల్లుగా మారిపోయింది. చెన్నై, హైదరాబాద్‌.. అంటూ చక్కర్లు కొడుతున్నా. ఇక్కడి సంస్కృతి కూడా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

English summary
It is revealed that Amy Jackson is seen as a robot who is working as an assistant to Rajinikanth in Robo 2.0 film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu