»   » హాట్ టాపిక్ : 'ఆడ రోబో' గా అమీ జాక్సన్‌

హాట్ టాపిక్ : 'ఆడ రోబో' గా అమీ జాక్సన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించనున్న ‘రోబో 2'లో కూడా హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఆడ రోబో గా కనిపించనుంది. అయితే అది నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది.

‘మదరాస పట్టిణం' చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన లండన్‌భామ ఎమీ జాక్సన్‌. ఆ తర్వాత తెలుగు, హిందీ జనాలకు కూడా సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఆమె దాదాపు దక్షిణాది హీరోయిన్ గా మారిపోయారు. ఓవైపు ఉదయనిధి సరసన ‘గెత్తు'లో, మరోవైపు ధనుష్‌తో కలసి ‘తంగమగన్‌', ఇంకోవైపు విజయ్‌తో ‘తెరి'లో నటిస్తూ బిజీగా ఉంది.

Amy Jackson turns female Robo

అమీ జాక్సన్ మాట్లాడుతూ... నేనెంతగానో ఇష్టపడే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించబోతున్నాననే మాట వినగానే సంబరంలో మునిగిపోయా. నిజంగానే నేను లక్కీగాళ్‌. అంతేకాకుండా శంకర్‌ దర్శకత్వంలో మళ్లీ నటిస్తుండటం నిజంగానే అదృష్టం. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.

అలాగే ఒక్కో సినిమాలో భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నా. నాకు ఇండియానే ముఖ్యంగా దక్షిణ భారతదేశమే నా పుట్టినిల్లుగా మారిపోయింది. చెన్నై, హైదరాబాద్‌.. అంటూ చక్కర్లు కొడుతున్నా. ఇక్కడి సంస్కృతి కూడా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

English summary
Amy Jackson will be playing a female robot in the upcoming Superstar-starrer Robo 2.
Please Wait while comments are loading...