twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ అల్లుడిని వివాదంలోకి లాగిన రాజకీయవేత్త..!?

    By Sindhu
    |

    ధనుష్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం 'మయక్కమ్ ఎన్న" ఇటీవల విడుదలై విజయవంతంగా ముందుకు దూసుకువెళుతోంది. ఈ సినిమాలో ధనుష్ పలు సన్నివేశాల్లో సిగరెట్లు కాల్చాడట. దీన్ని పిఎంకె పార్టీ అధినేత ది ఫార్మర్ యూనియన్ హెల్త్ మినిస్టర్ అన్బుమణి రామదాసు ఖండిస్తున్నారు. సిగరెట్లు కాల్చే సన్నివేశాలు వస్తున్నప్పుడు..ఆ సన్నివేశం క్రింద 'సిగరెట్టు కాల్చడం హానికరం" అనే స్క్రోలింగ్ రన్ అవ్వాలనే రూల్ నవంబర్, 14నుంచి అమలులోకి వచ్చింది.

    కానీ ఇటీవల విడుదలైన 'యమక్కమ్ ఎన్న" చిత్రంలో ఇలాంటి సన్నివేశాల కింద ఎలాంటి స్క్రోలింగ్ వేయలేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, యాక్షన్ తీసుకుంటేనే ఇకముందు ఇలాంటి సన్నివేశాలు తీసేటప్పుడు దర్శక, నిర్మాతలు జాగ్రత్తలు పాటిస్తారని డిమాండ్ చేస్తున్నాడు. రామదాసు. అలాగే సామాజిక బాధ్యతగా గుర్తించి ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి హీరోలు సైతం దూరంగా ఉండాలని ధనుష్ కి చురకవేస్తూ అతనిని కూడా పర్సనల్ గా వివాదంలోకి లాగాడు. మరి దీనికి హీరో ధనుష్ ఏ మేర స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

    English summary
    Dr Anbumani Ramadass urged the film industry to follow the guidelines of Union govt in smoking scenes. He also criticised that the recently released Mayakkam Enna hasn't follow the guidelines of the govt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X