»   » టీజర్ వచ్చేస్తోంది...రచ్చ మొదలవుద్ది

టీజర్ వచ్చేస్తోంది...రచ్చ మొదలవుద్ది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అభిమానులు, తోటి హీరోలు అంతా ఆసక్తి గా ఎదురుచూసేది చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ కోసం. ముఖ్యంగా పెద్ద హీరోల చిత్రాలకు ఫస్ట్ లుక్ టీజర్ అనేది చాలా కీలకమైన అంశం అయిపోయింది. ఎందుకంటే టీజర్ వదిలిన రోజు నుంచి చిత్రంపై నెగిటివ్ గానో,పాజిటివ్ గానో ఓ బజ్ స్టార్ట్ అయ్యి...అదే బిజినెస్ కి లీడ్ చేస్తుంది. తాజాగా తమిళ చిత్రం అంజాన్ ఫస్ట్ లుక్ టీజర్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో సికిందర్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 5న విడుదల చేయనున్నారు.

సూర్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా 'అంజాన్'. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో తిరుపతి బ్రదర్స్, యు టీవీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ టీజర్ కోసం తెలుగులోనూ వెయిటింగ్. తెలుగులో సూర్యకి మంచి మార్కెట్ ఉండటం, అలాగే ఎన్టీఆర్ రభసకు పోటీగా ఈ చిత్రం వేస్తూండటంతో టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం టీజర్ కోసం ఎదురుచూస్తోంది. లింగు స్వామి ఈ చిత్రాన్ని ఓ రేంజిలో తీసాడని తమిళంలో టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్లే తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్ భారీ మొత్తం ఇచ్చి మంచి పోటీలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకోవటం వార్తల్లో నిలిచింది.

మరోప్రక్క ఇన్నాళ్లూ ఫ్యామిలీ లుక్ లో కాస్త ఒద్దికగా సమంతను చూసిన వారు ఆమె తాజా చిత్రం లో ఆమె లుక్ ని షాక్ అవుతున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న అంజాన్ చిత్రం స్టిల్స్ ఇప్పుడు తెలుగు,తమిళ భాషల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

 Anjaan first look teaser date confirmed

"నేను ఇంత వరకు పనిచేసిన వ్యక్తుల్లో ది బెస్ట్ టీమ్ 'అంజాన్' టీమ్. చాలా నైస్ టీమ్. కావాలంటే ఈ విషయంలో ఎవరితోనైనా బెట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా కంఫర్టబుల్‌గా పనిచేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చారు'' అని అంటున్నారు సమంత. సూర్యతో కలిసి ఆమె నటిస్తున్న సినిమా 'అంజాన్'.
శుక్రవారంతో షూటింగ్ పూర్తయిందని సమంత ట్విట్టర్ ద్వారా తెలిపారు.

లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం.ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు. విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

English summary

 
 Surya’s Anjaan is planning to release its first look teaser on July 5th. Director Lingusmay has started the post production of the movie and he is planning to release the movie on August 15 as planned earlier.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu