»   »  గొడవపడ్డ డైరక్టర్ తో మళ్లీ చేస్తుందా?

గొడవపడ్డ డైరక్టర్ తో మళ్లీ చేస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఆంధ్రా బ్యూటి అంజలి మరో సమస్యలో ఇరుక్కుంది. ఆమెపై దర్శకుల సంఘం బ్యాన్ పెట్టే అవకాసం కనిపిస్తోంది. ఆమె నటిస్తూ ఆపిన చుట్ట్రి పురాణం పూర్తి చేసేవరకూ, వేరే చిత్రం ఒప్పుకోవటానికి వీల్లేదని దర్శకుడు కళైంజియం దర్శకుల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే ఇంకా దర్శకుల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. గతంలో ఇదే దర్శకుడుపై ఆమె కంప్లైంట్ చేసారు. తన పిన్నితో కలిసి షూటింగ్ ఫినిష్ చేయమంటున్నారని ఆమె అప్పట్లో పిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడుతో మళ్లీ ఆమె ఎలా పనిచేస్తుందనే విషయం అంతటా చర్చనీయాంసమైంది. అయితే ఆమె తన చిత్రం పూర్తి కాకుండా వేరే తమిళ చిత్రం చేయటానికి వీల్లేదని కళైంజియం పట్టుపడుతున్నారు.

ఇక జర్నీతో అందరి దృష్టిలో పడ్డ అంజలి ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేసి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే ఆ తర్వాత ఆమె కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేదు. అనంతరం ఆమె నటించిన బలుపు హిట్టైనా ఆఫర్స్ వరస కట్టలేదు. మసాలా సినిమా ఆమెకు మరింత వెనక్కి లాక్కుని వెళ్లింది. ప్రస్తుతం ఆమె కోన వెంకట్ సమర్పిస్తున్న గీతాంజలి అనే చిత్రం ఒకటే తెలుగులో చేస్తోంది.

Anjali again work with Kalanjiyam?

ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న ఆ తెలుగు పెద్ద నిర్మాత ఆమె డేట్స్ చూస్తూండటమే ఆమె కెరీర్ ముందుకు వెళ్లకపోవటానికి కారణం అంటున్నారు. ఆమె డేట్స్ కోసం సంప్రదిస్తే ఆ నిర్మాతను అడగమంటోందని, దాంతో చాలా మంది నిర్మాతలు...వేరే నిర్మాతను డేట్స్ కోసం అడగటమేంటని, అడిగినా రెమ్యునేషన్ బేరం అడగలేమని వెనక్కి తగ్గారు. రీసెంట్ గా మంచి విజయం సాధించిన చిత్రంలో ఓ పెద్ద చిత్రంలో సైతం ఆమెను అడిగారు. అయితే అప్పుడూ ఇదే సమస్య ఎదురై ఆమె ఆఫర్ వేరే ముంబై హీరోయిన్ కి వెళ్లిపోయింది. తెలుగు హీరోయిన్ కదా అని నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపించినా ఆ నిర్మాత వలన ఆమె డేట్స్ కు ఎవరూ వెళ్లటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇక తమిళంలోనూ ఆమె పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ మధ్యన మురుగదాస్‌ నిర్మాతగా మారి నిర్మించిన 'వట్టికుచ్చి' లో అంజలి నటించింది. మురుగదాస్‌ శిష్యుడు పి.కిన్‌స్లివ్‌ దర్శకత్వం వహించారు. మురుగదాస్‌ సోదరుడు దిలీపస్‌ హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం 'ప్రాణం కోసం' అనే పేరుతో అనువదించారు. అయితే ఆ సినిమా ఇక్కడ వర్కవుట్ కాలేదు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంజలి ఇలా కెరీర్ ని పాడుచేసుకుంటోందంటున్నారు.

English summary
Director Kalanjiyam has lodged a complaint in Director's Association on Anjali for "stalling his film Oor Suttri Puranam". Responding to the issue Director's Association has sent notice to Anjali and her manager. It looks like time is not going well for anjali, let’s wait and see how our beauty reacts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu