»   »  హీరోయిన్ అంజలి పై కోర్టు ఆగ్రహం

హీరోయిన్ అంజలి పై కోర్టు ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హీరోయిన్ అంజలి పై చెన్నై కోర్టు సీరియస్ అయ్యింది. ఆమె మరోమారు కోర్టుకు డుమ్మా కొట్టింది. కేసు విచారణ నిమిత్తం గురువారం అంజలి కోర్టుకు హాజరు కాకపోవటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29న తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆమె ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇప్పటికే పలుసార్లు కోర్టుకు గైర్హాజరు అయ్యింది. గతంలో కోర్టు పలు మార్లు హెచ్చరికలు చేసినా ఆమె తన తీరు మార్చుకోలేదు.

అంజలి పిన్ని భారతీదేవి తన దత్తపుత్రిక కనపడటంలేదని చెన్నయ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసింది. కాగా తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసి పరువు నష్టం కేసు విచారణకు కూడా అంజలి గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. దాంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. అయినా అంజలి తన పద్ధతి మార్చుకోలేదు. రవితేజ హీరోగా ఇటీవలే విడుదల అయిన బలుపు చిత్రంలో అంజలి ఓ హీరోయిన్గా నటించింది.

ఓ తమిళ నిర్మాత మరియు అంజలి తల్లి తనను వేదిస్తున్నారంటూ కంప్లైంట్ చేసిన తర్వాత ఆమె కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఐదు రోజుల తర్వాత అంజలి తనంతట తానె తిరిగి వచ్చేసింది. అప్పుడు కూడా వేదింపులు భరించలేక అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు చెప్పినది. ఇదిలా ఉంటె ఆ నిర్మాత అంజలిపై తన పరువు ప్రతిష్ట లు దెబ్బతిన్నాయంటూ కేసు పెట్టాడు. అంతే కాకా తమిళ ఫిల్మ్ చాంబర్ లో కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. తన సినిమాలో నటించడానికి అంగీకరించి ఇప్పుడు డేట్స్ ఇవ్వడం లేదని తెలిపాడు. ఇవన్ని ఇలా ఉంటె అంజలి ఓ తెలుగు నిర్మాతను వివాహం చేసుకుందనే వార్తలు ఈ మధ్య గుప్పుమన్నాయి.

పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అంజలిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు అంజలి ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి హాజరు కావడం లేదని, ఆమె మూలంగా తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. అంజలి తెలుగులో వెంకటేష్-రామ మల్టీ స్టారర్ 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. దీంతో పాటు ఆమె నటించిన 'మద గజ రాజా' చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల అంజలి మళ్లీ అదృశ్యం అయినట్లు వార్తలు వచ్చాయి. తాను ఎక్కడికీ వెళ్లలేదని అంజలి వివరణ ఇచ్చింది.

English summary
Heroine Anjali did not appear in the chennai court today. Her aunt had earlier filed a habeas corpus writ petition in the court , stating that her begotten Anjali is missing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu