»   »  క్యారెక్టర్ తగ్గించారని...అనుష్క అలిగిందా?

క్యారెక్టర్ తగ్గించారని...అనుష్క అలిగిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : అనూష్క అలిగిందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంసంగా మారింది. ఎందుకు అనుష్కకు కోపం వచ్చింది...ఎవరి మీద అంటే... 'సింగం-2' యూనిట్ మీద. ఎందుకంటే.... సూర్య తో తను నటించిన 'సింగం' చిత్రం ఘన విజయం సాధించింది.


'సింగం' చిత్ర విజయంలో అనూష్క షేర్ కూడా పెద్దదే. అంతేకాదు ఈ చిత్రంతో అనుష్క కూడా ఫుల్ బిజి అయిపోయింది. అనంతరం తమిళంలో వరుస అవకాశాలు పలకరించాయి. ఈ నేపధ్యంలో సింగం సీక్వెల్ 'సింగం-2' ప్రారంభం కాగానే మారు మాట్లాడకుండా,తన క్యారెక్టరేంటో అడగకుండా డేట్స్ కేటాయించింది.

అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న 'సింగం-2'లో అనుష్కకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తోంది. కథాపరంగా ఆమె పాత్రను తగ్గించడమే కాక ఇందులో రెండో హీరోయిన్ గా హన్సికను తీసుకున్నారు. షూటింగ్ జరుగుతుండగా అనుష్క ఈ విషయం తెలిసి అలిగినట్లు సమాచారం.

దాంతో తనవంతు కాల్షీట్లు పూర్తికాగానే 'సింగం-2' గురించి పట్టించుకోవటం మానేసిందట. రెండు రోజుల కిందట జరిగిన ఆడియో వేడుకకు కూడా డుమ్మా కొట్టిందని కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


ఈ చిత్రంలో హన్సిక స్కూల్‌ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది. అనుష్క మెయిన్ హీరోయిన్.

హన్సిక మాట్లాడుతూ ''చిన్నప్పుడు తరగతి గదిలో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. మళ్లీ యూనిఫామ్‌ వేసుకొని స్కూల్‌కెళ్లి చదువుకొంటే ఎంత బాగుంటుందో కదూ. స్కూల్‌ పిల్లలతో కలిసి తరగతిలో కూర్చొంటే భలే తమాషాగా అనిపించింది. పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయ''ని చెప్పింది. ఇంకో విషయమేమిటంటే... హన్సిక నిర్మాతగా మారబోతోందట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు తీయడం నా లక్ష్యం అంటోంది. ''ఎప్పట్నుంచో కంటున్న కల ఇది. తొందరలో సాకారమవుతుంద''ని చెప్పింది.

English summary
Singam II is an upcoming Tamil film directed by Hari, starring Suriya in the title role with Anushka Shetty, Hansika Motwani, Vivek and Santhanam in supporting roles. The film is a sequel to Singam (2010). The film, along with a dubbed Telugu version titled Yamudu II, is expected to be released worldwide on June 14, 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X