»   » అనుష్క డేట్స్ కోసం అంతటి డైరక్టరూ ఎదురు చూపు

అనుష్క డేట్స్ కోసం అంతటి డైరక్టరూ ఎదురు చూపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వైవిధ్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న బాలా మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతూన్న సంగతి తెలిసిందే. ఆర్య, విశాల్‌, అరవింద్‌స్వామి, అధర్వా, రానాలు ప్రధాన పాత్రధారులుగా ఆయన అతిపెద్ద మల్టీస్టారర్‌ సినిమాను అందించనున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర కోసం ఆయన అనుష్క ని సంప్రదించినట్లు సమాచారం. అయితే తన డేట్స్ ని బట్టి ఓకే చేయనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం తొలిదశ పనుల్లో నిమగ్నమయ్యారు బాలా. వచ్చేఏడాది తొలి వారంలో సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. 'సేతు', 'పితామగన్‌', 'నాన్‌ కడవుల్‌' వంటి భిన్నమైన సినిమాలను అందించారు. విక్రం, సూర్య, ఆర్యలకు హీరోలుగా గుర్తింపు తెచ్చిపెట్టారు. ప్రస్తుతం శశికుమార్‌ హీరోగా 'తారతప్పటై' సినిమాను రూపొందిస్తున్నారు.

Anushka in Director Bala's next multi-starrer

ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనుల్లో కూడా చివరిదశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఆయనకు ఇది 1000వ చిత్రం కావడం విశేషం. తన తదుపరి సినిమా పనులను కూడా బాలా ఆరంభించేశారు.

English summary
Tamil director Director Bala is trying to get in Anushka Shetty for the female lead in his next film. Bala is planning a multi-starrer movie with Arvind Swami and Rana Daggubati.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu