Just In
- 4 min ago
ఊరికే లింకులు పెడతారు కదా! అందుకే చేశా.. ఓపెన్‌గా చెప్పేసిన సుడిగాలి సుధీర్
- 10 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 11 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 11 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
Don't Miss!
- News
అమెరికాలో కాల్పుల కలకలం: దుండగుల కాల్పుల్లో పోలీసు సహా ఆరుగురి మృతి..
- Finance
బద్ధకం ఖరీదు... రూ 42,69,00,000
- Lifestyle
బుధవారం మీ రాశిఫలాలు 11-12-2019
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అనుష్క గెస్ట్ రోల్ ఆ స్టార్ సినిమాలో
అరుంధతితో ఓ వెలుగు వెలిగిన అనుష్క ఇప్పుడు ప్రతీ అవకాశం ఒప్పుకునే ముందు ఆచి తూచి అడుగులు వేస్తోంది.తాజాగా ఆమె ఓ గెస్ట్ రోల్ కమిటైంది. సూర్య సోదరుడు కార్తీ హీరోగా నటిస్తున్న శకుని చిత్రంలో ఆమె గెస్ట్ గా కనిపించనుంది.అయితే ఆమెది ఐటం సాంగ్ కూడా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. ఇక కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మాతగా కార్తి తన స్వంత బ్యానర్ స్టూడియో గ్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయనున్నాడు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. బావ చిత్రంలో సిద్దార్ధ సరసన చేసిన ప్రణీత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మాజీ హీరోయిన్ రాధిక ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఆమెది నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ అని తెలుస్తోంది.ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ స్టేజికి చేరుకుంది.
భారతంలో శకుని పాత్ర అందరికీ తెలిసిందే. అతని ఎత్తుగడలన్నీ విపక్షానికి లాభం చేకూర్చేవే. స్వపక్షాన్ని దెబ్బతీయడానికే. ఇలాంటి పాత్రే రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందన్న...ఆలోచన ఓ సినిమా దర్శకుడికి వచ్చింది. వెంటనే సినిమా తీయడానికి డిసైడ్ అయిపోయాడు. శకుని పాత్ర వేయడానికి తమిళ నటుడు కార్తి ఓకే చెప్పాడు. ఇంకేం..నవరసాలూ తెరపై ఒలికించే శకుని త్వరలో సినీ ప్రేక్షకుడు చూడబోతున్నాడు. ఆ సినిమా వివరాలేంటంటే...
వివి వినాయక్ దగ్గర పనిచేసిన ఎన్.శంకర్‌దయాళ్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. శకుని అనేది నెగెటివ్ టైటిల్ అయినా అది ఎవరు? అనేది చిత్రంలో చూడాల్సిందేనని కార్తి చెబుతున్నాడు.'ముందుగా టైటిల్ పెట్టినప్పుడు భయపడ్డాను. పూర్తిగా కథ విన్నాక.. శకుని కాదు శ్రీకృష్ణ పరమాత్మ పోలికలు ఉన్న రోల్ ఉంటుందని తెలుసుకున్నా. ఇందులో చాలా గెటప్స్ ఉంటాయి. ఇరవై నిముషాలకొక ట్విస్ట్ వస్తుందని హీరో కార్తి చెబుతున్నాడు...