»   » అనుష్క అసభ్యంగా విప్పి చూపిందని సెన్సార్...

అనుష్క అసభ్యంగా విప్పి చూపిందని సెన్సార్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క మరీ కురచ దుస్తుల్లో కవ్విస్తూ...ఓ మసాలా సాంగ్ చేసింది. అయితే దాన్ని సెన్సార్ వారు బ్లర్ చేసి చూపమని ఆర్డరేసారు. అలాగే కొన్ని బిట్స్ నిర్ధాక్షణ్యంగా కట్ చేసేసారు. ఇంతకీ ఆ చిత్రం ఏమీటీ అంటే క్రితం వారం తమిళంలో రిలీజైన 'సింగం'. గజనీ సూర్య హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తో కలెక్షన్స్ అదరకొట్టింది. అయితే సెన్సార్‌ దగ్గరకు వచ్చేసరికి అనుష్క ప్రతిభంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ పాట మరీ అభ్యంతరకరంగా ఉండడంతో సెన్సార్ ‌వాళ్లు తమ కత్తెరకి పని కల్పించక తప్పలేదు. శ్రుతి మించిన చోట ఏమీ కనిపించకుండా రంగులు అద్దారు. అలా అనుష్క కష్టమంతా సెన్సార్‌వాళ్ల కత్తెరకు బలైపోయింది. దాంతో చొంగకార్చుకుంటూ ధియోటర్ కి వచ్చిన తమిళ తంబీలకు నిరాశ ఎదురైంది. అయితే పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం విడుదలై, కమర్షియల్‌ గా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో అనుష్క తమిళంలో మరింత బిజీ కానున్నారు. తెలుగులో అనుష్క నటించిన రెండు వైవిధ్యమైన చిత్రాలు - వేదం, పంచాక్షరి ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక సింగం చిత్రాన్ని ఇక్కడ కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu