Don't Miss!
- News
ఇక స్లీపర్ క్లాస్ `వందే భారత్` రైళ్లు- గంటకు 220 కిలోమీటర్ల వేగంతో: శతాబ్దికి రీప్లేస్..!!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
అనుష్క చివరకు అతడితో అలా ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త!
Recommended Video

బాహుబలి, భాగమతి చిత్రం తర్వాత అనుష్క పెళ్లి వార్తనే మీడియాలో వైరల్ అయింది. ఇక ఆమె నటించే చిత్రాల విషయాలను జనం మరిచిపోయారు. తాజాగా పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి తమిళ చిత్రంలో నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు.

వీటీవీకి సీక్వెల్‌గా
గౌతమ్ మీనన్ కెరీర్‌లో విన్నైతాండి వరువాయ ( వీటీవీ) చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో ఏం మాయ చేశావే సినిమాగా రూపొందిన విషయం తెలిసిందే. శింబు, త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టింది. త్రిషా, శింబు కెమిస్ట్రీ ఈ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అలాంటి వీటీవీ చిత్రానికి సీక్వెల్‌గా మరో చిత్రాన్ని రూపొందించే పనిలో గౌతమ్ ఉన్నారు.

శింబు సరసన అనుష్కశెట్టి
వీటీవీ2 చిత్రం కోసం శింబును హీరోగా ఎంపిక చేశారు. శింబు పక్కన దేవసేన అనుష్కను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ చిత్రంలో శింబు, అనుష్క మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండించే విధంగా సీన్లు ఉంటాయనేది చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రొమాంటిక్, కామెడీగా వీటీవీ2
గతంలో శింబు, అనుష్క శెట్టి వానం అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఆ చిత్రం తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రొమాంటిక్ కామెడీ కోసం జత కలవడం ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.

త్వరలోనే సెట్స్‌పైకి
వీటీవీ2 చిత్రానికి మొదట ఓద్రాగ అని టైటిల్ పెట్టారు. ఆ తర్వాత విన్నైతాండ్ర వారువెన్ అనే పేరును ఖారారు చేశారు. ప్రస్తుతం ధనుష్‌తో ఓ చిత్రం, విక్రమ్‌తో ధ్రువ నక్షత్రం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఫినిష్ అయిన తర్వాత వీటీవీ2 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.