»   »  హాట్ టాపిక్: అనుష్కకు అమెరికాలో ఆపరేషన్?

హాట్ టాపిక్: అనుష్కకు అమెరికాలో ఆపరేషన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : గత కొద్ది రోజులుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఇదే వార్త హల్‌చల్ చేస్తోంది. హీరోయిన్ అనుష్క ఆపరేషన్ చేయించుకునేందుకు అమెరికాకు వెళుతున్నట్లు చర్చ నడుస్తోంది. దాంతో ఆమె అభిమానుల్లో ఇది నిజమా...కేవలం రూమరా అనేది అర్దం కాక కన్ఫూజన్ లో ఆమెకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా మెసేజ్ లు పెడుతున్నట్లు సమాచారం.

Anushka1

కోలీవుడ్ లో వినపడుతున్న దాన్ని బట్టి... అనుష్క తాజా చిత్రం సైజ్ జోరీ కోసం...చాలా పెద్ద ఎడ్వించర్ చేసింది. తన శరీర బరువును సుమారు 100 కిలోల వరకూ పెంచుకుంది. ఇది పెద్ద రిస్క్ అని అనుష్కకు ఇప్పుడర్థమైంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన సైజ్ జీరో (తమిళంలో ఇంజి ఇడుప్పళగి) చిత్రం బాగా వచ్చిందంటున్నారు. కాని అనుష్కకు ఇప్పుడా బరువు తలనొప్పిగా మారిందంటున్నారు.


ప్రస్తుతం ఆిమె నటించి సూపర్ హిట్టైన బాహుబలి చిత్రానికి సీక్వెల్ మొదలవుతోంది. ఇందులో సన్నగా నాజూగ్గా ఉండాలని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి చెప్పినట్లు సమాచారం.


దీంతో యోగా టీచర్ అయిన అనుష్క బరువు తగ్గటానికి యోగా ఫీట్స్ మొదలెట్టినా పెద్దగా ఫలితం లేకపోవడంతో అమెరికాలో కొవ్వు తగ్గించే శస్త్ర చికిత్స అనుష్కకు చేయించుకోవలసిందిగా కొందరు సన్నిహితులు సలహా ఇచ్చారట.


Anushka2

శస్త్ర చికిత్స వల్ల కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని అనుష్క ఆలోచిస్తున్నారని అంటున్నారు. దాంతో తాను త్వరగా బరువు తగ్గడానికి మరేదయినా దారి ఉందా? అని అనుష్క ఆలోచనలో పడిందట.


అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సైజ్‌ జీరో'. 'సన్నజాజి నడుము' అనేది ఉపశీర్షిక. ఆర్య, భరత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మించారు.


నిర్మాత మాట్లాడుతూ ''బొద్దుగా కనిపించే ఓ అమ్మాయి అందమైన ఆకృతి కోసం ప్రయత్నించిన విధానం చుట్టూ సాగే కథ ఇది. తన నడుమును సన్నజాజి పువ్వులా మార్చుకొనేందుకు ఎలాంటి పాట్లు పడిందో తెరపైనే చూడాలి. వినోదమే ప్రధానంగా తెరకెక్కింది. ఆర్య, అనుష్క మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు, వినోదం ప్రేక్షకులకు నచ్చుతాయి. కీరవాణి సంగీతం, నీరవ్‌ షా కెమెరా పనితనం సినిమాని ప్రధాన బలం. చేసిన ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభించింది'' అన్నారు.


Anushka3

ఈ నేపధ్యంలో ఈ చిత్రం డబ్బింగ్ ప్రారంభించారు. ఆటోనగర్ సూర్య, 100% లవ్ చిత్రాలతో పాపులర్ అయిన నందు ఈ చిత్రంలో హీరో క్యారక్టర్ ఆర్యకు డబ్బింగ్ చెప్పారు. అనుష్క ఈ సినిమా కోసం 20 కేజీల బరువు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గింది.అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.

English summary
Anushka Shetty who has gained a weight of 20 Kilo for her upcoming movie ‘Size zero’ is thinking to go for surgery in order to lose weight and fit into any type of role.The actress is planning to tone her body once again as she has to start shooting for ‘Baahubali 2’. Now she is completely done with the project and she will start her journey to USA soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu