ముంబైలో రజనీ దర్బార్.. ఓటు హక్కు కోసం తలైవా ఏం చేశారంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొద్దిరోజులుగా ముంబైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించుకొనేందుకు ఈ షూటింగ్ కాస్త విరామం ఇచ్చి చెన్నైకి వెళ్లారు. ఓటు హక్కు ఉపయోగించుకొన్న తర్వాత మళ్లీ ముంబైకి ప్రయాణమై షూటింగ్‌లో బిజీగా మారారు.
ఇక దర్బార్ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తొలిభాగంలో రజనీ సామాజిక కార్యకర్తగా, సెకండాఫ్‌లో ఐపీఎస్ అధికారిగా కనిపిస్తారని చెన్నై సినీవర్గాల టాక్.

దర్భార్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఏఆర్ మురగదాస్ ప్రత్యేకంగా సెట్‌ను వేశారు. కథలో భాగంగా ముంబైలో జరిగే సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
దర్భార్ చిత్రంలో రజనీకాంత్‌తోపాటు నయనతార, యోగిబాబు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తదితరుల నటిస్తున్నారు. రజనీ కెరీర్‌లో 167వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020 పొంగల్‌కు ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











