For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ నెల్లో ఏఆర్ రెహ్మాన్ మ్యూజికల్ నైట్...వివరాలు

  By Srikanya
  |

  చెన్నై : సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ నెల 29న పాటల కచేరీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి చెన్నైలోని నందనం, వైఎంసీఏ మైదానం వేదిక. 1990 దశకంలో సినీ సంగీతానికి కొత్త అర్థానిచ్చి ఇప్పటికీ ట్రెండ్‌సెట్టర్‌గా ముందుకుసాగుతున్న రెహమాన్‌ మరోసారి నగరవాసులను ప్రత్యేకంగా ఇలా అలరించనున్నారు. ఈ సందర్భంగా శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను సంగీతం సమకూర్చిన 'రోజా' నుంచి తాజాగా విడుదలైన 'కడల్‌' వరకు చిత్రాల్లోని ముఖ్యమైన పాటలను ఇందులో వినిపిస్తామని చెప్పారు.

  ఎస్పీ బాలసుబ్రమణ్యం, శక్తి, కార్తిక్‌, బిన్ని, చిన్మయి, దీప్తితోపాటు తన సోదరీమణులు కూడా పాలుపంచుకుంటారని అన్నారు. ఇలాంటి కచేరీని చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నానని, అందుకు సమయం ఇన్నాళ్లకు కుదిరిందని పేర్కొన్నారు. మొత్తం 30 పాటలు పాడనున్నట్లు చెప్పారు. తాను నాలుగైదు ఆలపిస్తానని వివరించారు. ఎ.ఆర్.రెహ్మాన్ ఇంతకు ముందు రూపొందించిన తాయ్ మన్నే వణక్కమ్ జాతీయ గీతంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు అదే పేరుతో మ్యూజి కల్ నైట్‌ను నిర్వహించనున్నారు.

  జయా టీవీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మ్యూజికల్ షోను 12 ఏళ్ల తరువాత మళ్లీ ఏఆర్ రెహ్మాన్ చెన్నైలో ప్రత్యేకంగా తమిళ పాటలతో నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుండడం విశేషం. ఏఆర్ రెహ్మాన్ తొలి చిత్రం రోజా చిత్రం నుంచి తాజా చిత్రం కడల్ లోని పాటల వరకు ఈ మ్యూజికల్ షోలో ప్రేక్షకులను అలరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 పాటలు ఈ షోలో ఆలపించనున్నట్లు ఎ.ఆర్.రెహ్మాన్ వెల్లడించారు. వీటిని ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, హరిహరన్, కార్తీక్, చిత్ర, బెన్ని, పాల్గొననున్నారని తెలిపారు. ఇలాంటి బ్రహ్మాండమైన మ్యూజికల్ షోను నిర్వహించాలన్నది తన చిరకాల వాంఛ అని రెహ్మాన్ పేర్కొన్నారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి టిక్కెట్టు ధర వచ్చే ఆదాయంలో పది శాతాన్ని జయ టీవీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధికి అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

  రెండు ఆస్కార్లు అందుకుని భారతీయ సినిమా కీర్తిని ఇనుమడింపజేసిన స్వర తరంగం ఎ.ఆర్‌.రెహమాన్‌ - తనకు ఆస్కార్‌పై ఆశలుపోయాయని చెప్పారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రెహమాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''దాదాపు 12 సంవత్సరాల తరవాత ఓ కచేరి నిర్వహించబోతున్నాను. ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో ఆశగా ఉండేది. ఇప్పటికి నెరవేరుతోంది. ఒకేసారి రెండు ఆస్కార్‌ అవార్డులు తీసుకున్న తరవాత ఆ పురస్కారమ్మీద మోజుపోయింది. తమిళ చిత్రాలకు సంగీతం అందించడం చూసి.. బాలీవుడ్‌లో 'మాకెందుకు చేయట్లేదు' అని అడుగుతున్నారు. నాకు అలాంటి తారతమ్యాలు లేవు'' అన్నారాయన

  . ఢిల్లీలోని అత్యాచారంపై మీ స్పందన ఏంటి? దీనిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారా? అని మీడియావారు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ''స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కొన్ని నెలల కిందటి నుంచే ఓ ఆల్బమ్‌ను రూపొందిస్తున్నాను. అది సంక్రాంతికి విడుదలవు తుంది'' అన్నారు. చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో మీ అబ్బాయి ఆమీన్‌ - పియానో వాయించారు. మరి ఈ కచేరీల్లో కూడా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు.. ''అతనిప్పుడు సంగీతం బాగా నేర్చుకుంటున్నాడు. నేను రూపొందించిన ఆల్బంలో నటించాడు. అమీన్‌ కూడా ఆల్బం రూపొందించే ఆలోచనలో ఉన్నాడు''అని పేర్కొన్నారు.

  English summary
  AR Rahman is going to do a live concert in Chennai! “Thaimanne Vanakkam”- A R Rahman Live In Concert will be held in Chennai On 29 December. The mega event live in concert will be held at Nehru Indoor Stadium and will be telecast on Jaya TV. Popular singers are to be roped in for this concert. The curtain raiser programme will be shown on Jaya TV on 14th November 2012 , which will also feature interview with AR Rahman and other celebrities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X