»   » ఎక్కడ విన్నా ఈ పాటే..దాని గురించే చర్చ

ఎక్కడ విన్నా ఈ పాటే..దాని గురించే చర్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ తన పాటతో మరోసారి సంచనలనం సృష్టిస్తున్నారు‌. 'మరియాన్‌', 'కోచ్చడయాన్‌'ల తర్వాత ప్రస్తుతం వసంత బాలన్‌ దర్శకత్వం వహిస్తున్న 'కావ్య తలైవన్‌' చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో సిద్ధార్థ్‌, పృధ్వీ తదితరులు నటిస్తున్నారు. రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, వైవిధ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఏఆర్‌ రెహ్మాన్‌ 22 పాటలకు సంగీతం సమకూర్చారు. ఆ 22 పాటల్లో ఒక పాట విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది.

హింసకు వ్యతిరేకంగా రూపొందించిన ఓ పాటను రెహ్మాన్‌ ఇటీవల విడుదల చేశారు. దీనికి ఒక రోజులోనే 50 వేల లైకులు వచ్చాయి. 'ఉలగమే యుద్ధం ఎదర్కు.. ఓ ఉయిర్‌గలే రత్తం ఎదర్కు..' (ప్రపంచమా యుద్ధం ఎందుకు.. ప్రాణమా రక్తం ఎందుకు..) అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్‌లో యుద్ధం చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ తరహా పాట కాకతాళీయంగా మారింది.రానున్న 31వ తేదీన ఆడియో విడుదల చేయనున్నట్లు సమాచారం.

AR Rahman’s song with a message

ఇక త్వరలో.. ఎ.ఆర్‌.రెహమాన్‌కు బోస్టన్‌లోని బెర్కలీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. 'స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌', '127 అవర్స్‌', 'ఎలిజిబెత్‌:ది గోల్డెన్‌ ఏజ్‌', 'మిలియన్‌ డాలర్‌ ఆర్మ్‌' తదితర ప్రపంచస్థాయి చిత్రాలకు స్వరాలు అందించి సంగీతానికి చేస్తున్న సేవలకు గుర్తుగా ఈ డాక్టరేట్‌ అందజేస్తున్నారు. ''సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేసిన బెర్కలీ కళాశాల నుంచి ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉంది.

నా పేరుమీద అక్కడి విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వడానికి నిర్ణయించడం గర్వంగా ఉంది'' అని రెహమాన్‌ తన స్పందన తెలిపారు. కళాశాల ప్రెసిడెంట్‌ రోగర్‌ హెచ్‌ బ్రౌన్‌ చెబుతూ ''జాన్‌ విలియమ్స్‌, స్టింగ్‌ రోల్డ్‌ కలిస్తే రెహమాన్‌ అవుతారని ఇండియాలో ఓ స్నేహితుడు చెప్పాడు. రెహమాన్‌ గౌరవార్థం డాక్టరేట్‌ ఇచ్చే రోజున మా కళాశాల విద్యార్థులు ప్రత్యేక సంగీత విభావరి నిర్వహిస్తారు. అక్టోబరు 24న వేడుక జరుగుతుంది''అన్నారు.

English summary
AR Rahman has shared the preview of one of the songs from Kaaviyathalaivan on his social networking page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu