»   » అందులో నాకు ఆసక్తి లేదు: ఎ.ఆర్.రహమాన్

అందులో నాకు ఆసక్తి లేదు: ఎ.ఆర్.రహమాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ త్వరలో దర్శకుడుగా మారి సినిమాని డైరక్ట్ చేయనున్నాడనే వార్తలు గత కొంత కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఈ మధ్యన ఆయన ఓ కథ రాసి నిర్మిస్తున్నారు. దాంతో త్వరలోనే ఆయన దర్శకుడిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని ముంబయి చిత్రవర్గాలు భావిస్తున్నాయి. దీనిపై ఎ.ఆర్ రహమాన్ స్పందించారు.

రహమాన్ మాట్లాడుతూ... ''సంగీతమే నా జీవితం. సంగీత దర్శకుడనే ముద్ర మాత్రమే నాకు కావాలి. కథ రాయడం అనుకోకుండా జరిగింది. దర్శకత్వం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. దర్శకుడిగానో, నటుడిగానో నన్ను చూడటం కష్టం. అందులో నాకు ఆసక్తి లేదు''అని చెప్పారు.

AR Rahman

స్వరరాజ్యంలో సరికొత్త శైలికి శ్రీకారం చుట్టిన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌. మార్పునకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఆయన చాటారు. తన స్వరప్రస్థానాన్ని విదేశాలకూ విస్తరించారు. తనదైన బాణీలతో ఆకట్టుకునే రెహ్మాన్‌ కొన్ని సంవత్సరాలుగా రాసిన కథకు చిత్రరూపాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. దీనిని హిందీలో తెరకెక్కించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. సినిమాకు సంబంధించిన పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారాయన. దాంతో ఆయన దర్శకుడిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని రూమర్స్ మీడియాలో వస్తున్నాయి.

ఇక రెహ్మాన్‌ రాసిన కథపై ప్రస్తుతం పలురకాల వార్తలు వినిపిస్తున్నాయి. సంగీత దర్శకుల నేపథ్యంలో ఈ కథను రూపొందించారని కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆయన జీవిత విషయాలను కూడా ఇందులో ప్రస్తావించారని కూడా మరికొందరు అంటున్నారు. ఏదైమైనా రహమాన్ కథ ఆయన సంగీతంలా కొత్తగా ఉండి అలరిస్తుందా లేదా అనేది ఇప్పుడు అంతటా చర్చగా మారింది.

English summary
There were reports that AR Rahman, the Oscar-Grammy winning music composer, would soon wield the megaphone for a movie and he was busy with script works.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X