For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అరమ్’ ఫస్ట్ టాక్.. నయనతార ఇరుగదీసిందట.. ఇక లేడీ సూపర్‌స్టార్ అట..

  By Rajababu
  |
  ‘అరమ్’ ఫస్ట్ టాక్.. నయనతార ఇరుగదీసిందిగా..

  వయసు పెరుగుతున్న కొద్ది అందాల తార నయనతార యాక్టింగ్ పరంగాను, సినిమా ఎంపిక పరంగాను రెచ్చిపోతున్నది. అటు గ్లామర్ పాత్రలతోనే కాకుండా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు నయనతార. తన కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రాలను ఎంపిక చేసుకోవడంలో ఈ ముద్దుగుమ్మ లేటు వయసులోనూ సత్తా చాటుతున్నది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నయనతార నటించిన సినిమా అరమ్. అరమ్ అంటే న్యాయం లేదా ధర్మం చేయండి అని అర్థం. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో నవంబర్ 10న రిలీజ్ అయింది. ఈ చిత్ర కథపై, నయనతార యాక్టింగ్‌పై సినీ విమర్శకులు వన్‌సైడ్ రివ్యూలతో ప్రశంసించడం విశేషం. అరమ్ చిత్రం తెలుగులో కర్తవ్యం పేరుతో త్వరలో విడుదల కానున్నది.

  అరమ్ కథ ఏమింటంటే..

  అరమ్ కథ ఏమింటంటే..

  అరమ్ చిత్రంలో మాదివధాని అనే కలెక్టర్ పాత్రను నయనతార పోషించింది. ప్రజల కష్టాలను రాజకీయ నేతల ముందు ఉంచి ప్రశ్నించే పాత్రను పోషించింది. గ్రామాల్లో తాగునీరు లాంటి కనీస వసతులను కల్పించాలని నిలదీసే పాత్ర. ఆమెది. రాజకీయ నేతల అలసత్వానికి షాకిచ్చే పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది అని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

   కమర్షియల్ ఇమేజ్‌ను పక్కన..

  కమర్షియల్ ఇమేజ్‌ను పక్కన..

  కమర్షియల్ గ్లామర్ ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి నయనతార నటించింది అనే ప్రశంసను క్రిటిక్స్ వ్యక్తం చేస్తున్నారు. అరమ్ సినిమా భారాన్ని మొత్తం తనపైనే మోసింది. ఇతర పాత్రల్లో సున్ను లక్ష్మీ, రామచంద్రన్ దురైరాజ్, వేలా రాంమూర్తి, కాకా ముట్టైలో నటించిన రమేశ్, విఘ్నేష్‌ తెరమీద అద్భుతంగా రాణించారు అనే మాటను సినీ క్రిటిక్స్ వెల్లడిస్తున్నారు.

  అరం సెకండాఫ్ అదుర్స్

  అరం సెకండాఫ్ అదుర్స్

  సెకండాఫ్‌లో టీవీ యాంకర్ ఎపిసోడ్‌తోపాటు కొన్ని సీన్లు ఊపిరి బిగపట్టి చూసేంతగా ఉంటాయి. ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ అనే టైటిల్‌ను నయనతార ప్రేక్షకుల నుంచి గెలుచుకుంటుంది అనే వాదన వినిస్తున్నది.

  గోపి నైనార్ అద్భుతంగా

  గోపి నైనార్ అద్భుతంగా

  అరమ్ చిత్రానికి గోపి నైనార్ దర్శకత్వం వహించారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫర్ బాధ్యతల్ని నిర్వహించారు. ట్రైలర్‌లోనే గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు గట్టినట్టు చూపించారు. జిబ్రాన్ అందించిన మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పుకొంటున్నారు.

   దేశ పరిస్థితులకు అద్దం..

  దేశ పరిస్థితులకు అద్దం..

  అరమ్ సినిమా భారతదేశ గ్రామీణ పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భారత దేశం సూపర్ పవర్ అని చెప్పుకునే నాయకులకు ఈ సినిమా చెంపపెట్టు అని అంటున్నారు. ఓ అమ్మాయి (ధన్సిక) లోతైన బావిలో పడిన ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయి కుటుంబం ఓ వైపు పోరాడటం, మరో వైపు పోలీసులు, డాక్టర్లు, రాజకీయనేతలు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి అని చెప్తున్నారు.

  ఏకపక్షంగా హై రేటింగ్స్

  ఏకపక్షంగా హై రేటింగ్స్

  ఓ దశలో కమర్షియల్ అంశాలు లేవని ఈ చిత్రానికి రీలీజ్ చేయడానికి వెనుకడుగు వేసిన డిస్టిబ్యూటర్లకు అరమ్ ఓ చెంపపెట్టుగా మారింది అనే మాట బలంగా వినిపిస్తున్నది. ఈ చిత్రానికి తమిళనాట విశేష స్పందన వస్తున్నది. మీడియాలో ఈ చిత్రానికి ఏకపక్షంగా హై రేటింగ్స్ రావడం ఓ సంచలనం అని చెప్పవచ్చు.

  English summary
  Aramm, one of the many women-centric films of this year, released today and critics are going gaga over everything about the film. Nayanthara is convincing in the role of an idealistic IAS officer, who put the needs of the people before the demands of the politicians. Aramm is a slap on the face to everyone who says India is marching towards superpower. How can that be a reality, when we’re still a nation where there are delays in the rescue of a young girl who has accidentally fallen into a deep, long-winding well that is open in the first place due to the negligence of a local councillor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X