»   » ‘నరకాసురుడు’ టైటిలే ఓ రేంజిలో ఉంది, హీరో ఎవరో తెలుసా?

‘నరకాసురుడు’ టైటిలే ఓ రేంజిలో ఉంది, హీరో ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ స్టార్ అర‌వింద్ స్వామి కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ వరుస అవకాశాలతో దూసుకెలుతున్నారు. తన వయసుకు తగిన విధంగా కీలకమైన పాత్రలు, విలన్ రోల్స్ చేస్తున్న ఈ స్టార్ 'ధృవ' సినిమాతో టాలీవుడ్‌కి మరింత దగ్గరయ్యాడు.

అరవిందస్వామి ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు కార్తీక్ న‌రేన్ తమిళంలో తెరకెక్కిస్తున్న 'న‌ర‌గ‌సూర‌న్' అనే చిత్రం తెలుగులో 'నరకాసురుడు'గా రాబోతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల‌లో విడుద‌ల కానుంది. అరవింద్ స్వామి బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మూడు భాషల్లో టైటిల్ పోస్టర్లు విడుద‌ల చేశారు.

Aravind Swamy in Karthick Naren's 'Narakasurudu'

ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, శ్రేయా శ‌రణ్ మ‌రియు ఇంద్ర‌జిత్ సుకుమార‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గౌతమ్‌ మీనన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Aravind Swamy in Karthick Narens next movie Narakasurudu. The movie produced by Goutham Menon on Ondraga Entertainment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu