»   » ఆంజనేయ స్వామి గుడి పనిలో అర్జున్

ఆంజనేయ స్వామి గుడి పనిలో అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాక్షన్ హీరో అర్జున్ చెన్నైలోని గేరుంబాకంలో తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తున్నాడు. ఇరవై మూడు అడుగుల ఎత్తు 15 టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని కర్ణాటకటలోని హుబ్లీలో నిపుణుల సమక్షంలో తయారుచేయిస్తున్నారు. ఇక విగ్రహం తయారుచేయటానికి కావల్సిన రాయి కోసం చాలా ప్రాంతాలు తిరిగి ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఇక ఈ విగ్రహం పద్మాసనం పొజీషన్ లో ఉంటుంది. ఇక కర్ణాటక నుంచి చెన్నై ఈ విగ్రహాన్ని తీసుకురావటానికి ప్రత్యేకంగా 160 చక్రాల ట్రక్ తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాఘవ లారెన్స్ కూడా మొన్నీ మధ్య రాఘవేంద్రస్వామి గుడి కట్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్జున్ తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రంలో చేస్తున్నారు. లక్ష్యం వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్,బిందుమాధవి ఈ చిత్రంలో జంటగా చేస్తున్నారు. అలాగే అర్జున్ ఇంతకుముందు కృష్ణ వంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం చిత్రం చేసారు. ఆ చిత్రంలో అర్జున్ ఆంజనేయ స్వామిగా కనిపిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu