twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఆంజనేయ స్వామి భక్తుడ్ని.. 150 సినిమాలు, ఇలాంటి నీచమైన పని చేస్తానా!

    |

    బాలీవుడ్ లో నానా పాటేకర్‌పై తనుశ్రీ దత్త చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రమైన దుమారం సృష్టించాయి. తనుశ్రీ వ్యాఖ్యలతో ఇండియాలో మీటూ ఉద్యమం జోరందుకుంది. బాలీవుడ్ బడా దర్శకుడు, నటుల అసలు గుట్టు బయట పడింది. ఒక రకంగా చెప్పాలంటే మీటూ ఉద్యమం వలన కొన్ని చిత్రాలే ఆగిపోయిన పరిస్థితి. అదే విధంగా సౌత్ లో కూడా ప్రముఖ రచయితపై సింగర్ చిన్మయి ఆరోపణలు, సీనియర్ హీరో అర్జున్ పై నటి శృతి హరిహరన్ ఆరోపణలు తీవ్ర వివాదంగా మారాయి. అర్జున్ పై పోరాటానికి తాను ఎంత దూరమైన వెళతానని శృతి హరిహరన్ చేబోతోంది. ఈ వివాదంలో అర్జున్ తాజాగా హైకోర్టుని ఆశ్రయించాడు.

     కేసు కొట్టేయాలి

    కేసు కొట్టేయాలి

    ఓ చిత్ర షూటింగ్ సమయంలో అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ శృతి హరిహరన్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శృతి చేస్తున్న ఆరోపణలని అర్జున్, అతడి కుటుంబ సభ్యులు ఖండించారు. చాలా మంది సినీ ప్రముఖుల నుంచి అర్జున్ కు మద్దత్తు లభించింది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ అర్జున్ తాజాగా హైకోర్టుని ఆశ్రయించారు.

    ఆధారాలు లేకుండా

    ఆధారాలు లేకుండా

    ఈ మేరకు అర్జున్ తన న్యాయవాదితో హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ప్రచారం కోసం మాత్రమే అర్జున్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. అసత్య ఆరోపణలతో అర్జున్ పై నమోదైన కేసుని కొట్టేయాలని కోర్టుని కోరారు.

    నేను భార్యకు గులామ్: మీటూ ఎఫెక్టుతో వాళ్ల ఉద్యోగాలు పీకేసిన నిర్మాత! నేను భార్యకు గులామ్: మీటూ ఎఫెక్టుతో వాళ్ల ఉద్యోగాలు పీకేసిన నిర్మాత!

    ఆంజనేయ స్వామి భక్తుడ్ని

    ఆంజనేయ స్వామి భక్తుడ్ని

    నేను 37 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాను. 150 పైగా చిత్రాల్లో నటించాయి. ఆంజనేస్వామికి పరమ భక్తుడిని. చెన్నైలో 32 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం నిర్మించా. చెడుగా ప్రవర్తించి ఉంటే ఇన్నేళ్ల పాటు నటుడిగా కొనసాగే వాడినా అంటూ అర్జున్ తన ఫిటిషన్ లో పేర్కొన్నారు. శృతి చేసిన నిరాధారమైన ఆరోపణల వలన అర్జున్ కుటుంబం మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అర్జున్ న్యాయవాది కోర్టుకు వివరించారు.

     అర్జున్‌ని అరెస్ట్ చేయాలి

    అర్జున్‌ని అరెస్ట్ చేయాలి

    విచారణలో భాగంగా శృతి తరుపున న్యాయవాదులు కూడా వాదన వినిపించారు. ఈ కేసుని పోలీసులు నత్తనడన విచారిస్తున్నారు. దీనివలన కేసు పక్కదోవ పట్టే అవకాశం ఉంది. అందువలన నిందితుడి వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. తదుపరి విచారణని న్యాయస్థానం నవంబర్ 2 కు వాయిదా వేసింది.

     ప్రాణహాని ఉంది

    ప్రాణహాని ఉంది


    ఈ వివాదంలో మహిళా కమిషన్ శృతి హరిహరన్ కు అండగా నిలబడుతోంది. అర్జున్, ఆయన అభిమానుల నుంచి శృతి హరిహరన్ కు ప్రాణహాని ఉందని మహిళ కమిషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు శృతికి తగిన భద్రత కల్పించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

    English summary
    Arjun Sarja Moves High Court, Demands Quashing of FIR Against Him. Arjun Sarja accused Sruthi Hariharan of misusing the MeToo movement
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X