For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకు విలన్ గా ఆర్నాల్డ్‌: ఓకే అనాలంటే కండీషన్స్ ఇవే

  By Srikanya
  |

  చెన్నై : దర్శకుడు శంకర్ గానీ, సూపర్ స్టార్ రజనీ కానీ ఇప్పటివరకూ ఒక్క ముక్క కూడా రోబో 2 గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. అయినా వార్తలు మాత్రం ఆగటం లేదు. అఫిషీయల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేలోగా ఈ చిత్రం గురించి వచ్చే వార్తలతో ఓ పుస్తకం వేసేయచ్చు అని సినీ వర్గాల్లో వినపడుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా రజనీకు ఆపోజిట్ గా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్నాల్డ్ ఈ ప్రాజెక్టు ఓకే చేయటానికి కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం. ఆ కండీషన్స్ ఏమిటి...అనేది మీరు ఈ క్రింద స్లైడ్ షో లో చూడవచ్చు.

  ఈ కండిషన్స్ లో ముఖ్యంగా వంద కోట్ల రూపాయలు ఆయన రెమ్యునేషన్ గా అడిగినట్లు సమాచారం. బడ్జెట్ 300 వందల కోట్లు అనుకుంటున్న ఈ చిత్రంలో ఆయన నటిస్తే అది హాలీవుడ్ ప్రాజెక్టు అవుతుందనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో ఆయనతో కంటిన్యూగా లైకా ప్రొడక్షన్స్ వారు చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

  ఇందులో హీరోకి దీటైన పాత్ర కావడంతో ఆర్నాల్డ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఆయన నటిస్తున్నారా? లేదా? అన్న విషయం స్పష్టం కాలేదు. కానీ ఆర్నాల్డ్‌ ఒప్పుకొన్నట్లు కూడా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు కనిపిస్తున్నాయి. 'కబాలి' చిత్రీకరణ కొలిక్కి వచ్చాకే దీనిపై శంకర్‌ ప్రకటన చేసే అవకాశముంది.

  దర్శకుడు శంకర్‌ తెరకెక్కించనున్న 'రోబో 2'పై రోజుకో ఆసక్తికరమైన విషయం వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో భాగంలో విలన్‌పాత్ర అత్యంత కీలకమని శంకర్‌ సన్నిహిత వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం 'కబాలి' చిత్రీకరణలో బిజీగా ఉంటున్న రజనీకాంత్‌ అది పూర్తి కాగానే 'రోబో 2'లో నటించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం శంకర్‌ చాలా కసరత్తులు చేస్తున్నారు.

  స్లైడ్ షోలో పెట్టిన కండీషన్స్, మిగతా విశేషాలు..

  నో కాంప్రమైజ్

  నో కాంప్రమైజ్

  హాలీవుడ్ స్ధాయిలో తన గత చిత్రాల లాగే భారీ ఎత్తున విడుదల చేయాలి. కాంప్రమైజ్ కాకూడదు

  పబ్లిసిటీ సైతం

  పబ్లిసిటీ సైతం

  ఈ సినిమాకు పబ్లిసిటీలో తనను హైలెట్ చేయాలి. అదీ ఇంటర్నేషనల్ ఛానెల్స్ లో కవర్ చేయాలి

  విదేశాల్లో షూటింగ్

  విదేశాల్లో షూటింగ్


  తన స్దాయికి తగినట్లు విదేశాల్లో షూటింగ్ ఉండాలి. లొకేషన్స్ విషయంలో స్టాండర్డ్స్ పాటించాలి

  కమల్ రిజెక్టు చేసారు.

  కమల్ రిజెక్టు చేసారు.


  ఇటీవల కమల్‌హాసన్‌కు కూడా ఆయన 'రోబో 2' విలన్‌ పాత్రను చెప్పినట్లు కూడా సమాచారం. దీంతో కమల్‌ ఇందులో నటించబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ వాటన్నిటినీ ఆ చిత్రవర్గాలు ఖండించాయి. కమల్ రిజిక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

  అమీర్ ఖాన్ సైతం

  అమీర్ ఖాన్ సైతం

  ఈ కథను మొదట అమీర్ తో అనుకున్నారు. అయితే అమీర్ సైతం తను బిజీగా ఉన్నట్లు తేల్చి చెప్పారు.

  విక్రమ్ తో ...

  విక్రమ్ తో ...

  కమల్, అమీర్ ఖాన్ కాదన్నాక శంకర్ తన హీరో విక్రమ్ తో ముందుకు వెళ్తాడనుకున్నారు. అయితే పెద్ద స్టార్ కావాల్సి వచ్చి వద్దనుకున్నట్లు సమాచారం.

  హీరోయిన్ గా..

  హీరోయిన్ గా..

  ఈ సినిమాలో హీరోయిన్ గా... కత్రినా కైఫ్ కానీ, దీపికా పదుకోని గానీ చేసే అవకాసం ఉంది.

  గతంలో..

  గతంలో..

  సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరో (శాస్త్రవేత్త)గా, రోబో (విలన్ )గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రోబో. సౌందర్యరాశి ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శంకర్ హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గని విధంగా చిత్రీకరించారు. చిత్రం ఘన విజయం సాధించింది.

  ఇంటర్నేషనల్ గా..

  ఇంటర్నేషనల్ గా..

  2010లో అద్భుత విజయాన్ని సాధించి తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం రోబో. అలాంటి చిత్రానికి సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

  ఊపందుకుంది

  ఊపందుకుంది

  ఆ చిత్ర కెప్టెన్ శంకర్ కూడా రోబోకు కొనసాగింపును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఈ చిత్ర సీక్వెల్ నిర్మాణం గురించి ఇటీవల మళ్లీ ప్రచారం ఊపందుకుంది.

  అందుకే లేటు

  అందుకే లేటు

  లింగా తరువాత రజనీ, ఐ చిత్రం తరువాత శంకర్ రిలాక్స్ అవడం అందుకు ఒక కారణం కావచ్చు. అయితే రోబో చిత్రానికి కొనసాగింపు గురించి వీరిద్దరూ ఇటీవల కథా చర్చలు జరిపినట్లు కూడా కోలీవుడ్ టాక్.

  టైం తీసుకునే..

  టైం తీసుకునే..

  ఈ ఇద్దరిని కలిపి శంకర్ తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున వెండి తెరపై మరోసారి అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నట్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.

  బడ్దెట్ లెక్కలు

  బడ్దెట్ లెక్కలు

  రోబో చిత్ర నిర్మాణం 130 కోట్లుగా ప్రచారం అయ్యింది. అయితే ఈ చిత్రానికి అత్యధికంగా 200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. వీటిలో పారితోషికమే 100 కోట్లకు చేరుతుందని మరో 100 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందనేది గణాంకాలు.

  అంత పెట్టాల్సిందే..

  అంత పెట్టాల్సిందే..

  చిత్ర ప్రచార ఖర్చు రూ.50 కోట్లు, పైగా మరో 50 కోట్లు వ్యయం ఉంటుందని మొత్తం 300 కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాత ముందుకు వస్తేనే ఎందిరన్-2 చిత్ర రూపకల్పన సాధ్యం అని సినీ పండితులు వాదన.

  కథ సిద్దమైంది

  కథ సిద్దమైంది

  ప్రస్తుతం ఈ చిత్రానికి రెండవ భాగాన్ని తెరపై ఆవిష్కరించడానికి శంకర్ సిద్ధమైనట్లు సమాచారం. ఆయన దీనికి కథను కూడా సిద్ధం చేశారట.

  గ్రీన్ సిగ్నల్..

  గ్రీన్ సిగ్నల్..

  ఇప్పటికే ఈ చిత్రంలో నటించడానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శంకర్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపికలో నిమగ్నమయ్యారని సమాచారం.

  English summary
  If a latest report turns out to be true then we could well be looking at a prominent Hollywood actor making his Tamil debut along with Superstar Rajinikanth in Enthiran 2. Few reports have also claimed that Lyca productions are currently in touch with the Hollywood superstar and that they might actually convince him to be a part of Enthiran 2. Will they manage to rope him in or will Arnold turn down the 100 crore offer? Stay tuned to know.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X