For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీన్ లోకి ఆర్నాల్డ్‌ ...రజనీకు విలన్ గా

  By Srikanya
  |

  చెన్నై : దర్శకుడు శంకర్‌ తెరకెక్కించనున్న 'రోబో 2'పై రోజుకో ఆసక్తికరమైన విషయం వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో భాగంలో విలన్‌పాత్ర అత్యంత కీలకమని శంకర్‌ సన్నిహిత వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం 'కబాలి' చిత్రీకరణలో బిజీగా ఉంటున్న రజనీకాంత్‌ అది పూర్తి కాగానే 'రోబో 2'లో నటించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం శంకర్‌ చాలా కసరత్తులు చేస్తున్నారు. గతంలో షారుఖ్‌ఖాన్‌కు కూడా కథ వినిపించినట్లు వార్తలు వినిపించాయి.

  arnold 1

  ఇటీవల కమల్‌హాసన్‌కు కూడా ఆయన 'రోబో 2' విలన్‌ పాత్రను చెప్పినట్లు కూడా సమాచారం. దీంతో కమల్‌ ఇందులో నటించబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ వాటన్నిటినీ ఆ చిత్రవర్గాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో 'రోబో 2'లో విలన్‌ పాత్ర పోషించడం కోసం హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌తో శంకర్‌ బృందం చర్చలు జరిపినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

  ఇందులో కథానాయకుడికి దీటైన పాత్ర కావడంతో ఆర్నాల్డ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఆయన నటిస్తున్నారా? లేదా? అన్న విషయం స్పష్టం కాలేదు. కానీ ఆర్నాల్డ్‌ ఒప్పుకొన్నట్లు కూడా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు కనిపిస్తున్నాయి. 'కబాలి' చిత్రీకరణ కొలిక్కి వచ్చాకే దీనిపై శంకర్‌ ప్రకటన చేసే అవకాశముంది.

  సూపర్‌స్టార్ రజనీకాంత్ నాయకుడి (శాస్త్రవేత్త)గా, రోబో (ప్రతినాయకుడు)గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రోబో. సౌందర్యరాశి ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శంకర్ హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గని విధంగా చిత్రీకరించారు. చిత్రం ఘన విజయం సాధించింది.

  robo1

  2010లో అద్భుత విజయాన్ని సాధించి తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం రోబో. అలాంటి చిత్రానికి సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆ చిత్ర కెప్టెన్ శంకర్ కూడా రోబోకు కొనసాగింపును తెరకెక్కించాలనుకుంటున్నారు. రోబో చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబోగా, దాన్ని కనుగొన్న శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేశారు. ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించారు.ఈ చిత్ర సీక్వెల్ నిర్మాణం గురించి ఇటీవల మళ్లీ ప్రచారం ఊపందుకుంది.

  లింగా తరువాత రజనీ, ఐ చిత్రం తరువాత శంకర్ రిలాక్స్ అవడం అందుకు ఒక కారణం కావచ్చు. అయితే రోబో చిత్రానికి కొనసాగింపు గురించి వీరిద్దరూ ఇటీవల కథా చర్చలు జరిపినట్లు కూడా కోలీవుడ్ టాక్. ఈ ఇద్దరిని కలిపి శంకర్ తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున వెండి తెరపై మరోసారి అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నట్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.

  rajani2

  రోబో చిత్ర నిర్మాణం 130 కోట్లుగా ప్రచారం అయ్యింది. అయితే ఈ చిత్రానికి అత్యధికంగా 200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. వీటిలో పారితోషికమే 100 కోట్లకు చేరుతుందని మరో 100 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందనేది గణాంకాలు. చిత్ర ప్రచార ఖర్చు రూ.50 కోట్లు, పైగా మరో 50 కోట్లు వ్యయం ఉంటుందని మొత్తం 300 కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాత ముందుకు వస్తేనే ఎందిరన్-2 చిత్ర రూపకల్పన సాధ్యం అని సినీ పండితులు వాదన. వారి అంత భారీ బడ్జెట్‌తో చిత్రం చేయడానికి ఎవరు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం.

  ప్రస్తుతం ఈ చిత్రానికి రెండవ భాగాన్ని తెరపై ఆవిష్కరించడానికి శంకర్ సిద్ధమైనట్లు సమాచారం. ఆయన దీనికి కథను కూడా సిద్ధం చేశారట. ఇప్పటికే ఈ చిత్రంలో నటించడానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శంకర్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపికలో నిమగ్నమయ్యారని సమాచారం.

  English summary
  If a latest report turns out to be true then we could well be looking at a prominent Hollywood actor making his Tamil debut along with Superstar Rajinikanth in Enthiran 2. It is to be noted that Arnold Schwarzenegger had made his presence felt during the audio launch function of Vikram's I and had also publicly expressed his interest to work with director Shankar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X