»   » అరవింద్ స్వామికి విడాకులు...కాస్టలీ ఒన్ టైమ్ సెటిల్మెంట్

అరవింద్ స్వామికి విడాకులు...కాస్టలీ ఒన్ టైమ్ సెటిల్మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోజా, బొంబాయి చిత్రాల హీరో అరవింద్ స్వామి..రీసెంట్ గా విడాకుల కోర్టుకు ఎక్కారు. ఆయన భార్య గాయత్రి రామమూర్తి..చెన్నైలోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టుని విడాకుల కోసం సంప్రదించింది. ఇద్దరూ ఇష్టపడే విడాకులు తీసుకుంటున్నామని పిటీషన్ లో తెలియచేసింది. 1994లో వివాహం చేసుకున్న అరవింద్ స్వామికి పధ్నాలుగు సంవత్సరాల అదిర అనే అమ్మాయి, తొమ్మిది సంవత్సరాల రుద్ర అనే కుమారుడు ఉన్నాయి. ఇక వీరిద్దరూ గత ఏడు సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. 2003 డిసెంబర్ లో వీరు విడిపోయిన దగ్గరనుండి పిల్లలు అరవింద్ స్వామితోనే ఉంటున్నారు. ఇక కోర్టు వీరి విడాకులకు ఒప్పుకుంది. ప్రిన్సిపల్ జడ్జి ఎస్. మీనాక్షి సుందరమ్...ఆమెకు ఒన్ టైమ్ సెటిల్మెంట్ 75 లక్షలు, నెలకు లక్ష రూపాయలు మెయింటినెన్స్ ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. మెయింటినెన్స్...ఆమె తిరిగి వివాహం చేసుకునేంత వరకూ ఆమెకు చెల్లించాలి. అలాగే ప్రతీ ఆదివారం పిల్లలు తల్లి దగ్గర ఉండవచ్చు. అలాగే వేసవి సెలవుల్లో వారం రోజులు పాటు పిల్లలు తల్లితో ఉండాలి అని తీర్పులో ఉంది. దీనికి అరవింద్ స్వామి ఒప్పుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu