»   » అల్లు అర్జున్,అనూష్క కాంబినేషన్ ఖరారు

అల్లు అర్జున్,అనూష్క కాంబినేషన్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్,అనూష్క కాంబినేషన్ లో వేదం చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.ఇదే కాంబినేషన్ లో మరో చిత్రం ఓకే అయింది.ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.ఆర్య కూడా ఈ చిత్రంలో చేయనున్నారు.తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.ఆర్య గతంలో తెలుగులో అల్లు అర్జున్ వరుడు చి్త్రంలో విలన్ గా చేసారు.ఇక సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అనూష్క కన్ఫర్మ్ చేస్తూ ప్రెస్ నోట్ ఇచ్చింది.

అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది.అదే కథ కనుక అయితే ఆ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు.అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది.రీసెంట్ గా తన అశోసియేట్ ని వివాహం చేసుకున్న సెల్వరాఘవన్ త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయింది.తమిళంలోని ఓ పెద్ద నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.

English summary
Selvaraghavan is likely to start working on a bilingual with Arya, Allu Arjun and Anushka Shetty. Confirming the news, actress Anushka said to a leading daily, "I have signed up to do Selvaraghavan’s next project a bilingual and will also be doing a film with Karthi."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu