»   » నయనతార తో ప్రేమ అంతా అబద్దం

నయనతార తో ప్రేమ అంతా అబద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : నయనతారను నేను ప్రేమిస్తున్నానా.. అబ్బే అలాంటిదేం లేదండీ.. నా పెళ్లి చేయడానికి మావాళ్లు అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని పేర్కొంటున్నాడు హీరో ఆర్య. స్టార్‌ హీరోగానే కాకుండా మహిళాభిమానులను పెద్ద సంఖ్యలో సంపాదించుకున్న నటుడు ఆర్య. నయనతార,ఆర్య తాజాగా 'రాజారాణి'లో నటించటం, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందనే వార్తలతో వీరి ప్రేమ వ్యవహారంపై వార్తలు మరోసారి జోరుగా వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదంటున్నాడు ఆర్య


ఆర్య మాట్లాడుతూ... '' కొన్ని నెలలుగా మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు 'రాజారాణి' చిత్రంలోని శుభలేఖతో మరింత వూపందుకున్నాయి. నయనతార నా సహనటి మాత్రమే. అంతకుమించి మా మధ్య మరో బంధమేదీ లేదు. ప్రస్తుతం మావాళ్లు నాకు వివాహం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అమ్మాయిని వెతుకుతున్నారు. వారు ఎంపిక చేసిన యువతి నాకూ నచ్చితే చేసుకుంటాను. ప్రేమ విషయానికొస్తే విద్యార్థి దశలో ఓ అమ్మాయిని ఆరేళ్లపాటు ప్రేమించా. ఆమెకు దూరమై సినిమాల్లోకి వచ్చాక ఇక ప్రేమ విషయం పూర్తిగా మర్చిపోయా. ప్రస్తుతం నా దృష్టిని కెరీర్‌పైనే కేంద్రీకరించా అన్నారు.

ఇక నయనతారకు నాకు వివాహం అంటూ ఆహ్వానపత్రికలు ప్రచురించడంతో మా ఇద్దరిపై రకరకాల వదంతులు ప్రచారమవుతున్నాయి. రాజారాణి చిత్రంలో నయనతార నేను భార్యాభర్తలుగా నటించాం. అందువలన ఆ చిత్ర ప్రచారం కోసం చిత్ర యూనిట్ ఆహ్వాన పత్రికలను ముద్రించింది. ఈ వ్యవహారంపై నయనతార అనుమతి తీసుకున్న తర్వాతే ఈ కార్యాన్ని తలపెట్టాం. అలాంటిది ఈ ఆహ్వాన పత్రికల విషయం నయనతారకు తెలియదని, అందువలన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని జరిగిన ప్రచారంలో నిజం లేదు అని తేల్చి చెప్పారు.

ఇక రాజారాణి చిత్రం సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే విధంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. చిత్రంలో అలాంటి సన్నివేశాలేవీ లేవు.ఇద్దరు హీరోల సినిమాల్లో నటించటంపై కొందరు వివరణ కోరుతున్నారు. కథ నచ్చితే కచ్చితంగా అలాంటివి చేస్తాను. కథ, దర్శకుడిలోని సృజనాత్మకతకే ప్రాధాన్యత మినహా... ఇద్దరు హీరోలా? నాకు ప్రాధాన్యత ఉందా? అనే విషయాలను పట్టించుకోను'అని పేర్కొన్నాడు.

ఈ చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారట. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'రాజా రాణి చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్, పెళ్లి తర్వాతి తీయని జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం' అని వెల్లడించారు.

ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉందని తెలిపారు. ఆర్య, నయనతార పెళ్లయిన జంటగా పర్‌ఫెక్టుగా నటించారు, వారి మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో ఆర్య, నయనతార, జై, సంతానం, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Arya says that there Is No Love Between Me And Nayantara. However, Arya has condemned the rumours before saying that he has invited many more heroines to his home for an inaugural ceremony. Reportedly after this incident, other actors are really confused whether to invite Nayan or not, as the chances of getting linked up are really high.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu