»   » ఆ లాడ్జిలో వద్దంటూ మారం చేస్తున్న అసిన్!

ఆ లాడ్జిలో వద్దంటూ మారం చేస్తున్న అసిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో తన కేరీర్ అయిపోయిందనుకుంటున్న తరుణంలో అందాల భామ అసిన్ కి వరుసగా మూడు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ చిత్రంలో అసిన్ నటించింది. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత అసిన్ రేంజ్ పెరిగిపోయింది. అక్కడి నిర్మతలు ఆమెకు 5 స్టార్ హోటల్స్ లో బస కల్పించేవారు. అయితే ప్రస్తుతం నయనతార నటించిన మళయాల సూపర్ హిట్ మూవీ 'బాడీగర్డ్" తమిళరీమేక్ చిత్రంలో విజయ్ సరసన నటిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు సిద్దిక్. ఈ చిత్రం షూటింగ్ ని తమిళనాడులోని కారక్కుడిలో ప్లాన్ చేశారు. అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోవడంతో సాదారణ లాడ్జిలో అసిన్ కి బస ఏర్సాటు చేశారు. అసిన్ అందులో ఉండటానికి ఇష్టపడలేదట. కానీ నిర్మాత అంతకు మించి అక్కడ వేరే సౌకర్యాలు లేవనడంతో ఒప్పేసుకుని ఆ లాడ్జిలోనే ఉందట. తాజాగా జాన్ అబ్రహాంతో 'ఘర్షణ" రీమేక్ లో నటించనుంది. అలాగే చాక్ లెట్ బాయ్ రణ్ భీర్ కపూర్ హీరోగా రూపొందనున్న 'కామోషీ" అనే చిత్రంలో కథానాయికగా అసిన్ ఎంపిక చేశారని సమాచారం. ఇలా వరుసగా సినిమాలు కమిట్ అవ్వడంతో అసిన్ రేంజ్ మరికొంత పెచ్చుకొంటూ తెగ ఆనందపడిపోతుందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu