శృతి దెబ్బకొట్టినా...కమల్ ఆదుకున్నాడు
'గజిని' రీమేక్‌తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్‌లవైపు చూడటమే మరిచిపోయింది. హిందీలోనూ అవకాశాలను అందిపుచ్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం. అంతేగాక తాజాగా ఓ హిందీ సినిమా అవకాశం అసిన్ నుంచి శ్రుతికి వెళ్లిపోవటంతో మరింత ఆవేదనకు గురైనట్లు సమాచారం. అయితే...కూతురు దెబ్బ కొట్టినా తండ్రి కమల్ తన సరసన ఆఫర్ ఇచ్చి ఆదుకున్నాడు.
కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి 'ఉత్తమ విలన్' అనే టైటిల్ ఖరారు చేసారు. కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా దర్శకుడు లింగుస్వామి ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి ఉత్తమ విలన్ అనే పేరును పెట్టినట్లు తెలిసింది. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.
ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.


Click it and Unblock the Notifications












