»   » నటుడు ప్రకాష్ రాజ్ ఇల్లు ముట్టడి, అరెస్టులు

నటుడు ప్రకాష్ రాజ్ ఇల్లు ముట్టడి, అరెస్టులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నయ్ లోని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నివాసాన్ని తమిళర్‌ మున్నేట్ర పడై పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. తమిళులే తమిళనాడును పరిపాలించాలి అన్న నినాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పరిపాలించవచ్చు' అన్న విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్, తమిళనాడు ప్రజల మనోభావాలను గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు...

Attack On Prakash raj's home

ఈ తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ప్రకాష్‌రాజ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌ క్షమాపణ చెప్పాలని కోరుతూ తమిళర్‌ మున్నేట్రపడై పార్టీ డిమాండ్‌ చేసింది. అయితే, ప్రకాష్‌రాజ్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక అడయార్‌లోని ఆయన నివాసాన్ని ఆ సంస్థకు చెందిన 50 మంది కార్యకర్తలు ముట్టడించారు. ఈ ఆందోళన ఆ పార్టీ వ్యవస్థాపకురాలు వీరలక్ష్మి సారథ్యంలో జరిగింది. ఆందోళన తీవ్ర రూపం దాల్చే స్థితికి చేరుకోవటం తో పోలీసులు ఆందోళన కారులని చెదరగొట్టి, ముఖులను అరెస్టు చేసారు. అయితే ఈ విషయం మీద ప్రకాష్ రాజ్ ఇప్పటి దాకా స్పందన ఏమిటో తెలియరాలేదు.

English summary
political party in Tamilanadu Named "Tamilar Munnetra Padai" Members Attacked on Actor Prakash Raj's house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu