»   » 'ఆవారా' గాడు వందరోజులు పూర్తిచేసుకున్నాడు...!

'ఆవారా' గాడు వందరోజులు పూర్తిచేసుకున్నాడు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కార్తి, తమన్నా జంటగా తమిళంలో రూపోందిన పయ్యా చిత్రాన్ని తెలుగులో 'ఆవారా' పేరుతో విడుదల చేశారు నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా . ఎన్.లింగుస్వానమి దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా నేటితో వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సంధర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా సంస్ధ లో 'కార్తీ' హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' 100 రోజులు ప్రదర్శింపబడుతుంది.

ఇప్పుడు 'ఆవారా' కూడా అన్ని ముఖ్య పట్టణాల్లో వందరోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా వుంది. ఒకే సంవత్సరంలో 'కార్తీ' హీరోగా నటించిన రెండు సినిమాలు శతదినోత్సవాలను పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సంవత్సరంలోనే కార్తీ హీరోగా నటించిన మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాం అని అన్నారు.

నైజాంలో ఎస్ వీ ఆర్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసిన 'శోభారాణి' మాట్లాడుతూ ఆవారా సినిమాకి నైజాంలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. మాస్ కేంద్రాల్లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇంత మంచి హిట్ చిత్రాన్ని మాకు అందించిన ఆవారా యూనిట్ కు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu