»   » స్కూల్‌ కుర్రాడు ప్రేమ....నమిత తిప్పలు

స్కూల్‌ కుర్రాడు ప్రేమ....నమిత తిప్పలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకన్నా వయసులో పెద్ద అయిన అమ్మాయితో ప్రేమలో పడే కుర్రాడు కథతో ఈ మధ్యనే తెలుగులో రీసెంట్ గా హైస్కూల్ అనే చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. కిరణ్ రాధోడ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం పిటీషన్స్, కోర్టు వాదనలు అయ్యి, స్టే వచ్చి మళ్ళీ రిలీజై వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇప్పుడు అదే తరహాలో తమిళంలోనూ భారీ అందాల నమిత ప్రధాన పాత్రలో హైస్కూల్ చిత్రం రిలీజవబోతోంది. తనకన్నా వయసులో పెద్ద అయిన నమితతో ఓ స్కూల్‌ కుర్రాడు ప్రేమలో పడే కథతో తాజాగా 'అళగాన పొన్నుదాన్‌' అనే తమిళ చిత్రం రెడీ అయ్యింది. అయితే ఈ చిత్రం కూడా అక్కడ వివాదాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ దర్శకుడు తిరు "నమిత వల్ల తీవ్రంగా నష్టపోయాను' అని చెబుతున్నాడు. ఈ చిత్రం విడుదల సమయంలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నమిత నిరాకరిస్తోంది.

అయితే నమిత వెర్షన్ వేరే విధంగా ఉంది. అసలిలాంటి సెక్సీ కథలో నటించడానికి నమిత ఎందుకు ఒప్పుకుంది అని అడిగితే...తనకు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు దర్శకుడు వేరే వారని చెప్పి మోసం చేసారంటోంది. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే 'పెరుసు' అనే చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో రూపొందించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు కామరాజ్‌. దాంతో తను ఆలోచించకుండా కథ కూడా వినకుండా డేట్స్ ఇచ్చానని, ఆ తర్వాత వాళ్ళు దర్శకుడు చివరి నిముషంలో మారాడని తిరు అనే అతను డైరక్ట్ చేస్తాడని చెప్పారని, దాంతో తాను షాక్ అయ్యానని చెప్పింది. 'తిరు' అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తారని చెప్పగానే డేట్స్‌ లేవని నమిత చెప్పుకుంటూ వచ్చారట. దాంతో నిర్మాత వైపు నుంచి కొంతమంది నమిత ఇంటికి వెళ్లి గొడవ చేశారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి, నటీనటుల సంఘం రంగంలోకి దిగి గొడవ చేసిన వ్యక్తులతో క్షమాపణలు చెప్పించి, డేట్స్‌ ఇవ్వాల్సిందిగా నమితకి చెప్పారట.

అంతేగాక ఈ చిత్రంలో మొదట ప్రముఖ హీరో నటిస్తారని నమితకి చెప్పి ఒప్పించారుట. అయితే ఆ తర్వాత దర్శకుడు తిరు అక్క కొడుకునే హీరోగా పెట్టి, నమితకు మరో షాక్‌ ఇచ్చారు. ఇలా మోసం చేయడం భరించలేని నమిత ఈ చిత్రం విడుదల సమయంలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిరాకరిస్తున్నానంటోంది. దాంతో సదరు దర్శకుడు "నమిత వల్ల చాలా నష్టపోయా' అని ప్రచారం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి నమిత బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయటంలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu