»   » రజనీకి ..'బాషా' దర్శకుడు స్పెషల్ బర్తడే గిప్ట్

రజనీకి ..'బాషా' దర్శకుడు స్పెషల్ బర్తడే గిప్ట్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: రజనీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ 'బాషా'. 'బాషా'దర్శకుడు సురేష్ కృష్ణకి రజనీకాంత్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన రజనీకాంత్ పుట్టిన రోజుకి ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అది మరేదో కాదు. 'మై డేస్ విత్ బాషా' అనే పుస్తకం. బాషా చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ రాసిన 'మై డేస్ విత్ బాషా' విడుదల కావటంతో రజనీ అబిమానులు పండుగ చేసుకుంటున్నారు.

  'బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే...' ఈ పాపులర్ డైలాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 'బాషా' చిత్రంలోనిది అని కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. 1995లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో భారీ విజయం సాధించింది. రజనీకాంత్ సీని చరిత్రలో ఈ చిత్రం ఓ మైలురాయి. ఈచిత్రంలో రజనీ మేనరిజం, స్టైల్ అదుర్స్ అంటూ చాలా మంది ఆయనకు అభిమానులైపోయారు. - హీరోయిజాన్ని స్పష్టం చేసే సంభాషణ ఇది.


  'బాషా' చిత్రంలోని ఈ పంచ్‌ డైలాగ్‌ని ప్రేక్షకులు మరచిపోలేరు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఆ చిత్ర కథన శైలి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు రచయితలు. ఆ సినిమాకి సురేష్‌కృష్ణ దర్శకుడు. ఆయన 'బాషా' చిత్ర అనుభవాలకు అక్షర రూపమిచ్చారు. ఆంగ్ల, తమిళ భాషలో పుస్తకాన్ని విడుదల చేసారు.

  12-12-12న రజనీ జన్మదినం రావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 'శివాజీ త్రీడీ' విడుదల ఓ వైపు, మరోవైపు, పేదలకు అన్న, వస్త్ర దానాలు ఇంకో వైపు. నిలువెత్తు కటౌట్లు, పూలహారాలు, పాలాభిషేకాలు మరోవైపు.. ఏదయితేనేం అభిమానగణం బుధవారం నిజమైన పండుగను, తలైవర్ జన్మదిన పండుగను చేసుకోనుంది.

  ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'కొచ్చాడయాన్'ను (తెలుగులో 'విక్రమ సింహ') సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యతగల ఈ చిత్రాన్ని రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రూపొందిస్తున్నారు. త్వరలో మణిరత్నం దర్శకత్వంలో 'దళపతి-2'లో నటిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. 'రంగం'తో విజయాన్ని అందుకున్న కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని కూడా కోడంబాక్కం సమాచారం.

  English summary
  Suresh Krissna has directed superstar Rajnikanth in huge hits like Annamalai and Baasha, as well as Veera. The director has encapsulated his memories of making these films in the book My Days With Baasha, which he has authored along with Malathi Rangarajan, a senior journalist with The Hindu. The book will be released on December 12 and Krissna hopes to present it to Rajnikanth as a birthday gift.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more