twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు: దర్శకుడు బాలా హీరోల వెరైటీ గెటెప్స్

    By Srikanya
    |

    చెన్నై: నటులను తెరపై ఒక్కో దర్శకుడు ఒక్కోలా చూపుతుంటారు. ఈ విషయంలో తమిళ దర్శకుడు బాలా శైలే వేరు. ఆయన హీరోలను గుండుతో, చిరిగిన దుస్తులు, మాసినగడ్డం, నిక్కరుతో విచిత్రంగా తెరపైకి తెస్తుంటారు. పాత్రకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విలక్షణత నచ్చి అగ్రహీరోలు సైతం ఆయన సినిమాల్లో నటించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఎలా కనిపించామన్నది ముఖ్యం కాదు.. బాలా చిత్రంలో నటించామా లేదా అన్నదే ప్రధానం అంటున్నారు.

    దర్శకుడు బాలా హీరోల వెరైటీ గెటెప్స్

    అవి విక్రమ్‌ నిలదొక్కుకునేందుకు పోరాడుతున్న సమయం. అప్పటికే పలు చిత్రాల్లో అందమైన యువకుడిగా కనిపించాడు. సరైన విజయం దక్కలేదు. అలాంటి సమయంలో ఆయన చేతికి గొలుసులు, చిరిగిన చొక్కా, గుండు.. అచ్చు మానసిక రోగిలా తెరపై దర్శనమిస్తాడని ఎవరూ వూహించి ఉండరు. అయితే విక్రమ్‌ను అలానే చూపాడు దర్శకుడు. చిత్రం సేతు. కొత్త దర్శకుడు బాలా. ఇది పట్టుమని పది రోజులైనా ఆడుతుందో లేదో అన్న మాటలు వినిపించాయి. సినిమావిడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో విక్రమ్‌ను ఎవరూ చూడలేదు. సేతు మాత్రమే కనిపించాడు. అలా పాత్రతోనే కథను నడిపిస్తానని చాటాడు బాలా.

    దర్శకుడు బాలా హీరోల వెరైటీ గెటెప్స్

    ఫ్రెండ్స్‌, మౌనం పేసియదే, పూవెల్లాం కేట్టుప్పార్‌ చిత్రాల్లో సూర్య అందమైన హీరోగా కనిపించాడు. ఈయనతో బాలా తన రెండో సినిమాగా 'నందా' తెరకెక్కించాడు. సూర్యను గుబురుగడ్డం, చింత నిప్పులాంటి కళ్లతో చూపించాడు. అందరూ ఆ వేషాన్ని చూసి ఆశ్చర్యపోయినా సినిమా చక్కటి వసూళ్లు సాధించి బాలా ముద్రను చాటింది.

    దర్శకుడు బాలా హీరోల వెరైటీ గెటెప్స్

    సేతు తర్వాత దిల్‌, ధూల్‌ అంటూ విక్రమ్‌ మాస్‌ పాత్రల్లో సత్తాచాటాడు. ఆయన్ను మళ్లీ సరికొత్తగా జనం ముందుకు తెచ్చాడు బాలా. అదే 'పితామగన్(శివ పుత్రుడు)'. ఇందులో శ్మశానంలో శవాలను కాల్చుతూ నాగరిక ప్రపంచానికి దూరంగా పెరిగే విక్రమ్‌ గారపట్టిన పళ్లు, ఒకట్రెండు పదాలకు మినహా ఎక్కువగా మాట్లడలేని వ్యక్తిగా, సినిమా మొత్తం ఒకే జత దుస్తులతో కనిపిస్తాడు. అప్పటికే 'కాక్కా కాక్కా'లాంటి బ్లాక్‌బస్టర్‌లో నటించిన సూర్య కూడా ఇందులో పాత చొక్కా, లుంగీతో కనిపించాడు. నటులు ఎవరైనా సరే తన చిత్రాల్లో ఇలాగే ఉంటారనే అభిప్రాయాన్ని బలంగా చాటాడు బాలా.

    దర్శకుడు బాలా హీరోల వెరైటీ గెటెప్స్

    అప్పటికే పలు రొమాంటిక్‌ ప్రేమకథల్లో కనిపించి రాకుమారుడిలా వెలుగుతున్న నటుడు ఆర్య. ఆయన్ను కూడా తాను ఎలా చూపుతానో ప్రేక్షకులకు తెలిసొచ్చేలా చేశాడు బాలా. 'నాన్‌ కడవుల్(నేనే దేముడ్ని)‌'లో ఆరడుగుల అందగాడు కాస్తా ప్రారంభ సన్నివేశంలో గోచీతో దర్శనమిచ్చాడు. సినిమా మొత్తం నలుపు చొక్కా, గుబురుగడ్డంతో అఘోరాలా మారిపోయాడు. ఈ చిత్రం ఆర్యను స్టార్ హీరోగా మార్చింది.

    దర్శకుడు బాలా హీరోల వెరైటీ గెటెప్స్

    ఆపై కూడా రొమాంటిక్‌ పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆర్యను 'అవన్‌-ఇవన్(వాడూ-వీడు)‌'లో అరగుండు, నిక్కరతో ప్రేక్షకుల ముందుంచాడు. మాస్‌ హీరోగా ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న విశాల్‌ను మెల్కన్ను, ఆడవారి లక్షణాలతో చూపించే సాహసం చేశాడు బాలా.

    దర్శకుడు బాలా హీరోల వెరైటీ గెటెప్స్

    'బాణాకాత్తాడి', 'ముప్పొళుదుం ఉన్‌ కర్పణైగల్‌'తో రివ్వున దూసుకొచ్చిన మురళి నటవారసుడు అధర్వ కూడా ప్రస్తుతం బాలా జాబితాలో చేరిపోయాడు. 'పరదేశి'లో అధర్య ఎలా ఉంటాడు అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆహార్యం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అరగుండు, ఒంటిపై గోనెపట్టా, జోలితో వూహించని పాత్రను కట్టబెట్టాడు బాలా. ఈ ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తోందో వేచి చూడాలి మరి!

    English summary
    Variety is the name of the game when it comes catching the attention of the audience and when it is a big hero, the expectations are double. In Bala's films the lead star will be given a different get ups. The heroes have to struggle a lot for his films but still all the stars prefer Bala’s films which gives a best output.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X