»   » ఎన్టీఆర్ గురించి ఆ విషయం తెలిసి షాకయ్యాడట!

ఎన్టీఆర్ గురించి ఆ విషయం తెలిసి షాకయ్యాడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకష్ణ తర్వాతి సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'గౌతమీపుత్ర శాతకర్ణి' తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన కెఎస్ రవికుమార్ ఆసక్తికర విషయం చెప్పారు.

కేవలం 79 రోజుల్లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా పూర్తి చేశారని తెలిసి ఆశ్చర్యపోయానని, ఇలాంటి జరుగాలంటే నటీనలకు సమయపాలన ఎంతో అవసరం... బాలకృష్ణ ఇలాంటి విషయాలు ఆయన తండ్రి ఎన్టీఆర్ నుండి నేర్చుకున్నారు అని కెఎస్.రవికుమార్ తెలిపారు.

Balakrishna learned punctuality s from his father: KS Ravi Kumar

అప్పట్లో సీనియర్ నటుడు నగేష్ ద్వారా ఎన్టీఆర్ గురించి తెలుసుకున్నాను. ఆ రోజుల్లో నగేష్ తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేవారు. ఓ రోజు నగేష్ గారు ఎన్టీఆర్ సినిమా షూటింగులో పాల్గొనేందుకు ఎర్లీ మార్నింగే హైదరాబాద్ వెళ్లాలనుకున్నారు. కానీ ఎయిర్ పోర్టుకు లేటుగా వెళ్లడం వల్ల ఫ్లైట్ మిస్సయ్యారట. వెంటనే నెక్ట్స్ ఫ్లైట్ ఎక్కేశారు. అదే ఫ్లైట్‌లో ఎన్టీఆర్ గారు కృష్ణుడి గెటప్‌లో ఉండటం చూసి నగేష్ గారు ఆశ్చర్యపోయారట.

ఫ్లైట్ లో ఇలాంటి గెటప్‍‌లో ప్రయాణిస్తున్నారెందుకని అడగ్గా...షూటింగ్ ఆలస్యం కాకూడదనే కారణంతోనే ఆల్రెడీ మేకప్ వేసుకుని వెలుతున్నాను. అక్కడిరీ వెళ్లి మేకప్ వేసుకుంటే షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారట. నగేష్ గారు ఈ విషయం చెప్పినపుడు ఎన్టీఆర్ షూటింగ్ విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో అర్థమైంది అని కెఎస్ రవికుమార్ వ్యాఖ్యానించారు.

English summary
Director KS Ravi Kumar has recently attended the trailer launch event of 'Gautami Putra Satakarni' Tamil version. He said that he was surprised to know that GPSK was completed in just 79 days. He said that punctuality is so important to achieve this kind of feat..and Balakrishna learned such things from his father.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu