»   » రానా, ఆర్య, ‘బెంగుళూర్ డేస్’ రీమేక్ ప్రారంభం (ఫోటోస్)

రానా, ఆర్య, ‘బెంగుళూర్ డేస్’ రీమేక్ ప్రారంభం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలం హిట్ మూవీ ‘బెంగుళూర్ డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తరచూ ఈ విషయమై మీడియాలో ఏదో ఒక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. పుకార్లన్నింటికీ తెరదించుతూ తాజాగా ఈ చిత్రం తమిళ వెర్షన్ లాంచనంగా ప్రారంభం అయింది.

మళయాలంలో నటించిన పార్వతి మీనన్ మినహా....తమిళ వెర్షన్లో అందరినీ కొత్త వారినే తీసుకున్నారు. ఆర్య, రానా దగ్గుబాటి, బాబీ సింహా, శ్రీప్రియ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మళయాలంలో దుల్‌కర్ పోషించిన పాత్రను ఆర్య, పహాద్ ఫాజిల్ పోషించిన పాత్రను రానా దగ్గుబాటి, నివిన్ పౌలీ పోషించిన పాత్రను బాబీ సింహా పోషిస్తున్నారు. నజ్రియా నజీమ్ పోషించిన పాత్రను శ్రీప్రియ చేస్తోంది.

మళయాలం వెర్షన్ కు సంగీతం అందించిన గోపీ సుందర్....తాజాగా తమిళ వెర్షన్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో తమిళ-తెలుగు వెర్షన్ కు ఒకే డైరెక్టర్ అనే ప్రచారం జరిగింది. అయితే రెండు వెర్షన్లకు వేర్వేరుగా ఇద్దరు డైరెక్టర్లు ఉంటారని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కు వేణు శ్రీరామ్(ఓహ్ మై ప్రెండ్ ఫేమ్) తీసుకునే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రసాద్ వి పొట్లూరి(పివిపి) నిర్మిస్తున్నారు. తెలుగులో దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది.

స్లైడ్ షోలో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు....

ప్రారంభోత్సవం...

ప్రారంభోత్సవం...


బెంగుళూరు డేస్ తమిళ వెర్షన్ ప్రారంభోత్సవానికి సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కొత్తవారే...

కొత్తవారే...


మళయాలంలో నటించిన పార్వతి మీనన్ మినహా....తమిళ వెర్షన్లో అందరినీ కొత్త వారినే తీసుకున్నారు. ఆర్య, రానా దగ్గుబాటి, బాబీ సింహా, శ్రీప్రియ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఎవరి పాత్ర ఏది

ఎవరి పాత్ర ఏది


మళయాలంలో దుల్‌కర్ పోషించిన పాత్రను ఆర్య, పహాద్ ఫాజిల్ పోషించిన పాత్రను రానా దగ్గుబాటి, నివిన్ పౌలీ పోషించిన పాత్రను బాబీ సింహా పోషిస్తున్నారు. నజ్రియా నజీమ్ పోషించిన పాత్రను శ్రీప్రియ చేస్తోంది.

డైరెక్టర్లు వేరు

డైరెక్టర్లు వేరు


ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో తమిళ-తెలుగు వెర్షన్ కు ఒకే డైరెక్టర్ అనే ప్రచారం జరిగింది. అయితే రెండు వెర్షన్లకు వేర్వేరుగా ఇద్దరు డైరెక్టర్లు ఉంటారని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కు వేణు శ్రీరామ్(ఓహ్ మై ప్రెండ్ ఫేమ్) తీసుకునే అవకాశం ఉంది.

నిర్మాతలు

నిర్మాతలు


ఈ చిత్రాన్ని తమిళంలో ప్రసాద్ వి పొట్లూరి(పివిపి) నిర్మిస్తున్నారు. తెలుగులో దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది.

English summary
After lot of speculations and rumours, the Tamil remake of Malayalam superhit movie "Bangalore Days" has been launched in Chennai. The pooja function of the multi starrer flick was held on 18 March.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu